Game Changer : #RRR వంటి సంచలనాత్మక విజయం తో ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్లి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్న రామ్ చరణ్, మూడేళ్ళ పాటు తన అమూల్యమైన సమయాన్ని ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరు అని సోషల్ మీడియా లో అతి కష్టం మీద వెతుక్కునే దుస్థితి వచ్చింది. శంకర్ ఇంకా 1990 కాలం లోనే ఉండిపోయాడని, ఈ సినిమాని చూస్తున్నంతసేపు పాత సినిమాలను చూసిన అనుభూతి కలిగింది అంటూ చెప్పుకొచ్చారు. బుక్ మై షో యాప్ లో కూడా ఈ సినిమాకి రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. IMDB లో కూడా అదే తరహా రేటింగ్స్ వచ్చాయి.
మూడేళ్ళ కష్టానికి ఇలాంటి ఫలితం వచ్చిందని రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో చాలా తీవ్రస్థాయిలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ కనిపిస్తే వాళ్లకు మంచి నీళ్లు ఇచ్చి, గౌరవ మర్యాదలు చేసి పంపేయాలి కానీ, వాళ్ళతో సినిమాలు ఎందుకు చేయడం అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. అభిమానుల వైపు నుండి ఈ చిత్రంపై అలాంటి రియాక్షన్స్ ఉంటే, రామ్ చరణ్ మాత్రం తన ఇంస్టాగ్రామ్ లో అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘మూడేళ్ళ వరకు ఈ చిత్రం కోసం కష్టపడినందుకు దానికి తగిన ఫలితం దక్కినందుకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మా సినిమా విజయం పట్ల సపోర్టుగా నిలిచినా మీడియా కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. రాబోయే సినిమాల్లో కూడా అభిమానులు గర్వించదగ్గ పాత్రలు పోషించి మిమ్మల్ని అలరించేందుకు ప్రయత్నం చేస్తాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
సినిమా ఫ్లాప్ అయ్యింది అనే విషయం రామ్ చరణ్ కి తెలియకుండా ఉండదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రెస్ నోట్ విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటి?, అభిమానులకు ఇక నుండి జాగ్రత్తగా సినిమాలు చేస్తాను అనే సందేశం పరోక్షంగా చెప్తూ ఈ లేఖని విడుదల చేశారా అంటే అవుననే చెప్పాలి. సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యింది అని ఒప్పుకోలేరు. అలా చేస్తే నిర్మాతలు మరింత నష్టపోతారు. అందుకే ఆయన ఇలాంటి మెసేజి ఇచ్చినట్టు తెలుస్తుంది. ‘వినయ విధేయ రామ’ సమయంలో సినిమా ఫ్లాప్ అయ్యింది, దయచేసి క్షమించండి, ఇక నుండి మీ మనోభావాలు దెబ్బ తినే సినిమాలు చేయను అంటూ అభిమానులకు బహిరంగ లేఖ ద్వారా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమాతో రామ్ చరణ్ అన్ని లెక్కలు తేల్చేస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.