https://oktelugu.com/

Nagarjuna and Chiranjeevi : నాగార్జున కి ప్రభాస్ అన్నయ్య 60 కోట్ల రూపాయిల అప్పు..చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని పట్టించుకోని యూవీ క్రియేషన్స్!

ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లిస్ట్ తీస్తే అందులో యూవీ క్రియేషన్స్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ తో పాటు, ఆయన స్నేహితులు కలిసి ఈ సంస్థ ని స్థాపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 15, 2025 / 05:37 PM IST

    Prabhas , Nagarjuna , Chiranjeevi

    Follow us on

    Nagarjuna and Chiranjeevi : ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లిస్ట్ తీస్తే అందులో యూవీ క్రియేషన్స్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ తో పాటు, ఆయన స్నేహితులు కలిసి ఈ సంస్థ ని స్థాపించారు. రామ్ చరణ్ కి కూడా ఈ సంస్థలో భాగం ఉంది. ప్రభాస్ మిర్చి సినిమాతో ఈ సంస్థ ప్రయాణం మొదలైంది. తొలి సినిమానే కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో భారీ ఎత్తున లాభాలను మూటగట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ తో కలిసి ‘రన్ రాజా రన్’ చిత్రం చేసారు. ఇది కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఆ తర్వాత గోపీచంద్ తో కలిసి చేసిన ‘జిల్’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత ఈ బ్యానర్ నుండి వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా, భలే భలే మొగాడివోయ్, భాగమతి, టాక్సీ వాలా వంటి చిత్రాలు పెద్ద హిట్ అయ్యాయి.

    చిన్న సినిమాలు తీస్తున్నంత కాలం ఈ బ్యానర్ సేఫ్ గా ఉన్నింది కానీ, ఎప్పుడైతే ప్రభాస్ తో సాహూ, రాధే శ్యామ్ వంటి సినిమాలు తీశారో అప్పటి నుండి నష్టాల్లో కూరుకుపోయింది. ఆదిపురుష్, వినయ విధేయ రామ వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి అక్కడ కూడా నష్టాలను కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి సెట్స్ పై మూడు సినిమాలను నిర్మిస్తున్నారు. ఒక సినిమాకి శర్వానంద్ హీరో. ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’. ఈ సినిమాకి టీజర్ కి ముందు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ళ తర్వాత చేస్తున్న ఫాంటసీ చిత్రం. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని అందరూ అనుకున్నారు.

    కానీ టీజర్ విడుదల అయ్యాక పెద్ద ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది. గ్రాఫిక్స్ విషయం లో నిర్మాతలు నాసిరకంగా వ్యవహరించారని, ఇంత చెత్త గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీ ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మండిపడ్డారు. అయితే డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ ఇవ్వడం లేదని, 40 కోట్లు ఖర్చు చేయాల్సిన చోట కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఏమైనా అడిగితే బడ్జెట్ లేదు అనే సమాధానం నిర్మాతల నుండి వచ్చేదట. షూటింగ్ ని అత్యధిక శాతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నారు. మేకర్స్ ఆ స్టూడియో కి ఇంకా 60 కోట్ల రుపాయిలకు పైగా పెండింగ్ రెంటల్ బిల్స్ ని కట్టాలట. యూవీ క్రియేషన్స్ మ్యానేజ్మెంట్ పై వాళ్ళ పని తీరుపై చిరంజీవి కూడా అసంతృప్తి గా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.