Bollywood Heroine : కెరియర్ స్టార్టింగ్ లో ఎంతో కష్టపడి హీరోయిన్లుగా అవకాశాలను అందుకొని సక్సెస్ అయ్యి స్టార్లుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హీరోల్లోనే కాదు హీరోయిన్లలో కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే చాలామంది హీరోయిన్లు సక్సెస్ అయిన తర్వాత తాము కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలు పడిన విషయాలను పలు సందర్భాలలో చెప్పుకుంటారు. సినిమా సెలబ్రిటీల అందరి జీవితం ఒకేలాగా ఉండదు. సినిమా ఇండస్ట్రీ లోకి కొంతమంది స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ వారసులుగా ఎంట్రీ ఇస్తే మరి కొంతమంది మాత్రం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తమకంటూ ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం కొంతమంది ఎన్నో కష్టాలు పడి స్టూడియోలో చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి ఆ తర్వాత అవకాశం అందుకొని హీరోయిన్లుగా మారారు. సినిమా మీద నటన మీద ఉన్న ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. తాజాగా ఒక హీరోయిన్ సినిమాల్లో అవకాశాలు రాకముందు తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. సినిమా అవకాశాల కోసం ఆమె ఎన్నో కష్టాలను భరించిందట. చివరకు హీరోయిన్గా అవకాశం అందుకొని సక్సెస్ సాధించింది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా కష్టపడిన ఆమె ప్రస్తుతం మూడు నిమిషాల ఒక పాటకు కోట్లలో పారితోషకం అందుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంతే అంత ఈజీ కాదు.
Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అల్లు అర్జున్ హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఎంతో కష్టపడాలి, అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలరు. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడిన వాళ్ళలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఒకరు. కెనడాలో జన్మించిన నోరా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మొదట్లో ఆమె జీవితం కష్టాలతో మొదలైనప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం సొంతం చేసుకుంది. కెనడాలో పెరిగినప్పుడు ఆర్థిక సమస్యలను, సామాజిక సవాళ్లను ఎదుర్కొన్న నోరా ఇండియాకు వచ్చిన తర్వాత అవకాశాల కోసం చాలా కష్టాలు పడింది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, పలు ఆడిషన్స్ లో తిరస్కరించడం, భాష రాకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది.
కానీ నోరా ఫతేహి డాన్స్ మరియు ఆమె కష్టపడే గుణం ఈమెకు బాగా మేలు చేశాయి. ఈమె యుక్త వయసులో ఉన్న సమయంలోనే ఆమె ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసింది. ఆ తర్వాత 2014లో రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రాలేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో ఈమెకు ఒక్కసారిగా బాగా గుర్తింపు వచ్చింది. ఈమె డాన్స్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో బిజీ నటిగా మారిపోయింది.
View this post on Instagram