Ram Charan Sukumar Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాలో ఏదోక స్ట్రాటజీని వాడుతూ ఆయన సక్సెస్ లను సాధిస్తున్నాడు. గత సంవత్సరం శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన భారీగా డీలా పడిపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మీద తను పూర్తి ఆశాలైతే పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆయన ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాననే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతుండటం విశేషం… ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమాని ఎక్కడ తడబడకుండా చాలా క్లారిటీ తో తెరకెక్కించాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక వారియర్ ల కనిపించబోతున్నడట. ఈ మూవీ కథేంటి అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాలో విలన్స్ గా ఇద్దరు తమిళ్ స్టార్ హీరోలను తీసుకోవాలనే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఒకరు విశాల్ కాగా, మరొకరు విక్రమ్…
ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి పేరైతే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరిలో ఎవర్నో ఒకరినైనా తీసుకుంటారు. లేదంటే ఇద్దరినీ తీసుకునే రిక్వైర్ మెంట్ కూడా ఉందట. ఇప్పటికే వారిని కలిసి కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు విలన్స్ గా నటిస్తే సినిమా మీద హైప్ తారా స్థాయికి వెళ్ళిపోతుంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
కాబట్టి సుకుమార్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన అన్ని విషయాలను అడిగి మరీ తెలుసుకొని సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇక ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది. కాబట్టి మరోసారి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అయితే దానికి విపరీతమైన హైప్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ప్రొడ్యూసర్లు సైతం ఈ కాంబినేషన్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది…