Ram Charan :సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద డైరెక్టర్ అయిన హీరోకి మొదట కథ చెప్పాల్సిందే. ఆ కథ ఆ హీరోకి నచ్చితేనే ఆ సినిమా ట్రాక్ లోకి వస్తుంది. లేదా ఆ చిత్రం మరొక హీరో తెరకెక్కిస్తారు. ఇది సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమే. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త విభిన్నంగా ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఆ ఇద్దరు దర్శకులు కథ చెప్పకుండానే ఆ సినిమాలు ఓకే చేస్తారట చరణ్. ఇంతకీ ఆ దర్శకులు ఎవరంటే.
రామ్ చరణ్ కెరియర్ లో మొదటి సూపర్ హిట్ చిత్రమైన “మగధీర”. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ మరొక చిత్రపరిశ్రమలకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న “ఆర్.ఆర్ ఆర్” డైరెక్టర్ రాజమౌళి. మరొకరు రంగస్థలం అలాంటి మరుపురాని కావ్యం లాంటి సినిమాని అందించిన సుకుమార్ అని చరణ్ చెప్పుకొచ్చారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చరణ్ ని “ఆర్ఆర్ఆర్” కథ వినకుండానే ఈ సినిమా ఓకే చేశారంట అని అడుగగా.. అది నిజమే అని చెర్రీ తెలిపారట.తాను కథ వినకుండా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరే అని అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు సుకుమార్ అని అన్నారు చరణ్. ప్రస్తుతం చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “RC15” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉంది.