Pop Singer:హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. “సామ్ అండ్ క్యాట్, ది వాయిస్” వంటి టీవీ షోతో మరింత పాపులర్ అయింది అరియానా. ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ లో ఈ భామ ఒకరు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన స్టైల్ లో ఫోటో షేర్ చేస్తూ ఉంటారు ఈ అమ్మడు. ఈ ఏడాది మే లో లాస్ ఏంజెల్స్ లగ్జరీ రియల్టర్ డాల్టన్ గోమెజ్‌ను సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకొని సెలబ్రిటీస్ కి అభిమానులకు షాక్ ఇచ్చారు ఈ క్యూట్ బ్యూటీ. అయితే తాజాగా మరోసారి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది అరియానా.

యావత్తు ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. సెలబ్రిటీస్ అంతా క్రిస్మస్ వేడుకలను తాము ఎలా చేసుకున్నారు వంటి ఫొటోస్ వీడియోస్ అభిమానులు షేర్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ పాప్ సింగర్ ట్విటర్ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.ఎటువంటి సమాచారం లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్. అరియానా సైబర్ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు.లేదా ఆమెమీద ట్రోలర్స్ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా అభిమానులు కోరుకుంటున్నారు.