Ram Charan: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు చరణ్…చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరియర్ మొదట్లో నటన విషయంలో చాలా రకాల విమర్శలు ఎదుర్కొన్నాడు. తనకి నటన సరిగ్గా రావడం లేదని, కేవలం చిరంజీవి కొడుకు కాబట్టి ఇండస్ట్రీలో నిలబడగలుగుతున్నాడు అంటూ చాలా మంది విమర్శలైతే చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం తన నటనతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడు. సినిమా సినిమాకి తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మొత్తానికైతే ధృవ, రంగస్థలం లాంటి రెండు సినిమాలతో తనేంటో ప్రేక్షకులందరికీ తెలియజేశాడు. దాంతో రామ్ చరణ్ సినిమాల మీద ప్రతి ఒక్కరికి గౌరవం పెరిగింది. అందుకే అతను ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. విలక్షణమైన పాత్రలను సైతం పోషించగలిగే స్టామినా తనలో ఉందని ప్రతి ఒక్క విమర్శకుడు రామ్ చరణ్ ను అభినందించడం విశేషం…ఇక రామ్ చరణ్ కి తమిళ్ డైరెక్టర్ అయిన వెట్రీ మారన్ అంటే చాలా ఇష్టం… అతను చేసే సినిమాలు రియలెస్టిక్ గా ఉంటాయని అణగారిన వర్గాలను ఆదరించడానికి తను సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడని ప్రేక్షకుడి మనస్సుకు గుచ్చుకునే విధంగా సన్నివేశాలను స్క్రీన్ మీద చూపించగలుగుతాడనే ఉద్దేశ్యంతోనే మెట్రిమారన్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక వెట్రి మారన్ చేసిన వడ చెన్నై, అసురన్, విడుదల సినిమాలంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక రామ్ చరణ్ వెట్రీ మారన్ ను కథ చెప్పమని అడిగినా మీ ఇమేజ్ కి సరిపడా కథ లేదని చెబుతున్నాడట. మొత్తానికైతే వెట్రీ మారన్ ను హైదరాబాద్ కి పిలిపించుకొని మరి రామ్ చరణ్ ఒక కథను చెప్పించుకున్నాడట.
ఆయన చెప్పిన కథకి రామ్ చరణ్ ఫిదా అయిపోయారట. కానీ తన ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ కథ ఉండకపోవడంతో రామ్ చరణ్ వెట్రి మారన్ తో ఏం చేద్దామో చెప్పి అని అడిగాడట. అప్పుడు వెట్రీ మారన్ ఇది వేరే వాళ్ళకోసం రాసుకున్న కథ సార్…ఇది మీకు మాత్రం సెట్ అవ్వని చెప్పాడట.
అలాగే నేను మీ ఇమేజ్ ని హ్యాండిల్ చేయలేనని కూడా చెప్పారట. దాంతో రామ్ చరణ్ ఎలాగైనా సరే మీతో మాత్రం నేను ఒక సినిమా చేస్తాను నా ఇమేజ్ కి సెట్ అయ్యే మంచి కథ రెడీ చేయండి అని చెప్పారట… ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే మాత్రం ఆ మూవీ భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…