Mana Shankara Vara Prasad Garu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేయగలిగే సత్తా ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో అనిల్ రావిపూడి ఒకరు… ఈయన సినిమాలన్నీ చల్ ఫన్నీ గా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి తన ఫ్యామిలీతో కూర్చొని అనిల్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. అనిల్ సైతం పండక్కి సినిమా రిలీజ్ చేసి ఆ పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇప్పుడు చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సైతం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం తనకి తిరుగుండదనే చెప్పాలి.
ఇప్పటికే సీనియర్ హీరోలైన బాలయ్య, వెంకటేష్ లకు సూపర్ సక్సెస్ లను అందించిన ఆయన ఇప్పుడు చిరంజీవికి కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తే సీనియర్ హీరోలకు మంచి విజయాన్ని అందిస్తున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు… మన శంకర వర ప్రసాద్ సినిమాలో వెంకటేష్ కూడా కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం…
ఇప్పటివరకు వెంకటేష్ చాలా కామెడీ పాత్రలను పోషించారు. కానీ ఈ సినిమాలో ఒక సీరియస్ క్యారెక్టర్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే చిరంజీవి, వెంకటేష్ లతో ఒక సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్ ను అలాంటి పాత్రలో చూడటం కష్టమే మొత్తానికి ఈ సినిమాతో ఏదో కొత్తగా ట్రై చేయాలని అని చూస్తున్నాడు కానీ తేడా కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…ఒక వేళ ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం అనిల్ కెరియర్ లో మొదటి ప్లాప్ సినిమా ఇదే అవుతోంది…
చిరంజీవి సైతం ఈ మూవీ మీద మంచి నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఇదికూడా రొటీన్ గా ఉంటే సినిమా మీద విమర్శలు చిరంజీవి మీద కామెంట్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సంక్రాంతి కి ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ సినిమాతో వస్తున్నాడు కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ జరగబోతోందనేది వాస్తవం…