Ram Charan Peddi Movie Climax Twist: ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత విడుదలైన సినిమాల్లో , ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించిన సినిమా ఒక్కటి కూడా లేదు. రెండు మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, ఆ టాక్ కలెక్షన్స్ ని తీసుకొని రాలేకపోయాయి. రీసెంట్ గా విడుదలైన ‘డెకాయిట్’, ‘LIK ‘ చిత్రాలకు కూడా డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆడియన్స్ చూపు మొత్తం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ పైనే ఉంది. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం జరుగుంటే , ఈ చిత్రం ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో జూన్ 25 కి వాయిదా పడిందని అంటున్నారు. కానీ మేకర్స్ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చెయ్యలేదు.
‘పెద్ది’ తర్వాత ఈ ఏడాది విడుదల అవ్వబోయే మరో స్టార్ హీరో సినిమా ‘ఫౌజీ’. ప్రభాస్ , హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కమ్ లవ్ స్టోరీ చిత్రం పై యూత్ ఆడియన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది దసరా ని టార్గెట్ గా చేసుకొని ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను చకచకా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. దానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి రెస్పాన్స్ గొప్ప రేంజ్ లో రాలేదు కానీ, షూటింగ్ లొకేషన్ నుండి లీకైన మేకింగ్ స్టిల్స్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ‘పెద్ది ‘, ‘ఫౌజీ’ చిత్రాల్లోని ఒక కామన్ ఎలిమెంట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ లో నడుస్తున్న చర్చ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఈ రెండు సినిమాల క్లైమాక్స్ సన్నివేశాలు అభిమానులు కలలో కూడా ఊహించని రేంజ్ లో ఉంటాయట. అంతే కాదు , ఈ సన్నివేశాలను అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేరట. ఆ రేంజ్ లో ఉంటాయని టాక్. ఈ సన్నివేశాల కారణంగా ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ స్టేటస్ హిట్ నుండి ఇండస్ట్రీ హిట్ స్థాయికి తీసుకెళ్తామని అంటున్నారు. ప్రభాస్, రామ్ చరణ్ కెరీర్స్ లో ల్యాండ్ మార్క్స్ గా నిల్చిన చిత్రాలు కూడా క్లైమాక్స్ కారణంగానే బాక్స్ ఆఫీస్ ఫలితాలు వేరే లెవెల్ కి వెళ్లాయి. ‘రంగ స్థలం’ క్లైమాక్స్ ని అసలు అంత తేలికగా మనం మర్చిపోగలమా?, సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే , క్లైమాక్స్ మరో ఎత్తు. ‘కల్కి 2898 AD’ కూడా అంతే . క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడి లాగా చూపించడం తో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితమే మారిపోయింది. ఇప్పుడు ‘పెద్ది’, ‘ఫౌజీ’ చిత్రాలకు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వబోతుందని టాక్.