Peddi Movie Story: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలం లో ఏ సినిమాకు రానటువంటి అద్భుతమైన బిజినెస్ ఆఫర్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ లో ఆ రేంజ్ లో ఉంది మరి. కానీ రీసెంట్ గానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా , ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 2 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటేందుకు నాలుగు రోజులకు పైగా సమయం పట్టింది , ఇది ఆరోగ్యకరమైన ట్రెండ్ కాదనే చెప్పాలి.
ఇదంతా పక్కన పెడితే , ‘పెద్ది’ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ‘పెద్ది’ అంటే కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే అని మీరంతా అనుకోని ఉంటారు. ఎందుకంటే మేకర్స్ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ఒక స్పోర్ట్స్ డ్రామా గా మాత్రమే ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా కోర్ పాయింట్ స్పోర్ట్స్ కాదు , ఆధునిక యుగం లో అభివృద్ధికి ఆమడదూరం లో ఉన్న ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక యువకుడు చేసే ప్రయత్నమే ఈ కథ. తన గ్రామానికి రైలుని రప్పించడానికి ఈ యువకుడు స్పోర్ట్ ని ఒక ఆయుధం గా చేసుకొని , అంతర్జాతీయ స్థాయిలో తన గ్రామానికి గుర్తింపు రప్పించి , అభివృద్ధి అయ్యేలా చేస్తాడట.
ఈ ప్రయాణం లో హీరో కి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి అనేదే ఈ చిత్రం. సినిమా మొత్తం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందట . ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రం లో మనం చూడొచ్చని అంటున్నారు. ఆ రేంజ్ లో ఔట్పుట్ వచ్చిందట. థియేట్రికల్ ట్రైలర్ తో సినిమా కథ ఎటు నుండి ఎటు వైపు వెళ్తుంది అనే దానిపై డైరెక్టర్ బుచ్చి బాబు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఈ నెల 18 న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో జరగబోతుంది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేలా చేస్తుందా?, లేదా తగ్గిస్తుందా అనేది చూడాలి.