Peddi Movie Release Date: ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ ఫ్లాప్ తో డీలా పడిన రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు, ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే రీసెంట్ గా విడుదల చేసిన ‘చికిరి..చికిరి’ పాట ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇండియా వైడ్ గా మాత్రమే కాదు, గ్లోబల్ వైడ్ గా ఈ పాటకు అద్భుతమైన రీచ్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో రీల్స్ , షార్ట్స్ లక్షల్లో అప్లోడ్ అవుతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక పాటకు ఈ రేంజ్ రీచ్ రావడం అనేది పెద్ది చిత్రానికే జరిగింది. విడుదలకు ముందే ఈ రేంజ్ రీచ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుండి త్వరలోనే రెండవ పాట కూడా విడుదల కాబోతుంది. రీసెంట్ గానే ఆ పాటకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు.
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చ్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా మార్చ్ 27 న విడుదల అవ్వడం దాదాపుగా సాధ్యం కాదని అంటున్నారు. ఎందుకంటే చాలా వరకు షూటింగ్ పెండింగ్ ఉందట. అంతే కాకుండా, మధ్యలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ కూడా చేయాల్సి వస్తుందట. జనవరి నెలాఖరు లోపు ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమని అంటున్నారు. మార్చ్ నెలలో కాకుండా ఏప్రిల్, లేదా మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.
ఇదంతా పక్కన పెడితే ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ని ఏప్రిల్ రెండవ వారం లో విడుదల చేస్తామని నిర్మాత రవి శంకర్ ఇది వరకే అధికారిక ప్రకటన చేసాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం బట్టి చూస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చ్ 19 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. దీన్ని బట్టీ చూస్తే పెద్ది చిత్రాన్ని వాయిదా వేసేందుకే చూస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యం అయినా ప్రపంచం లోని సినీ అభిమానులు మొత్తం గొప్పగా మాట్లాడుకునేలా పెద్ది చిత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.