Akhanda 2 Highlight Scenes: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి, కానీ బుకింగ్స్ ఆశించినంత రేంజ్ లో లేవు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే 1 మిలియన్ డాలర్లు కూడా ప్రీమియర్ షోస్ నుండి రాబట్టే అవకాశాలు కనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా అభిమానులెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని హైలైట్ సన్నివేశాల గురించి సోషల్ మీడియా లో ఇప్పుడు చర్చ నే నడుస్తుంది. నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే చాలా మూమెంట్స్ ఈ చిత్రం లో ఉన్నాయని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ లో వచ్చే కుంభమేళా సన్నివేశం ఆడియన్స్ రోమాలను నిక్కపొడుచుకునేలా చేస్తుందని అంటున్నారు. ట్రైలర్ లో కూడా ఈ సన్నివేశానికి సంబంధించిన షాట్స్ ని మనం చూడొచ్చు. ఈ ఏడాది మహారాష్ట్ర లో జరిగిన కుంభమేళా లోనే ఈ సన్నివేశానికి సంబంధించిన షూట్ జరిగినట్టు తెలుస్తోంది. నిజమైన లైవ్ లొకేషన్ లో ఇలాంటి షూటింగ్ జరగడం అనేది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే అల్యూమినియం ఫ్యాక్టరీ ఫైటింగ్ కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇక రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన జాజికాయ పాట వెండితెర అదిరిపోతోంది, బాలయ్య కెరీర్ లో బెస్ట్ డ్యాన్స్ మూవ్మెంట్స్ ఉన్న పాట అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్ రూఫ్ ఎగిరిపోతుందేమో అనే రేంజ్ భయం పుట్టిస్తుందట. ఈమధ్య కాలం లో అలాంటి హై వోల్టేజ్ ఇంటర్వెల్ సన్నివేశం రాలేదని అంటున్నారు. అదే విధంగా అఖండ ఫ్లాష్ బ్యాక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తామని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కి శివుడి దర్శనం ఆడియన్స్ కి జరుగుతుందట. శివుడి గెటప్ లో మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు ని AI ద్వారా చూపించబోతున్నారట. నిజంగా ఎన్టీఆర్ పైన నుండి క్రిందకు దిగి వచ్చి నటించాడా అనే రేంజ్ లో ఆ సన్నివేశం ఉంటుందట. ఇలా అన్ని రకాల పర్ఫెక్ట్ ప్యాకేజ్ తో వస్తున్నా ఈ చిత్రం ‘అఖండ’ కంటే పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు.