Homeఎంటర్టైన్మెంట్Peddhi Movie Pahlwan Glimpse: 'పెద్ది' కుస్తీ టీజర్ రివ్యూ : ఎక్కడో...

Peddhi Movie Pahlwan Glimpse: ‘పెద్ది’ కుస్తీ టీజర్ రివ్యూ : ఎక్కడో ఎదో మిస్ అయ్యింది.. AR రెహమాన్ దెబ్బేసాడు..

Peddhi Movie Pahlwan Glimpse: నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) పుట్టిన రోజు సందర్భంగా, అభిమానుల సంబరాలను రెట్టింపు చేస్తూ, నేడు పెద్ది (Peddi Movie) చిత్రానికి సంబంధించిన సరికొత్త టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులు ‘పెద్ది’ క్రికెట్ ఆడడం మాత్రమే ఆడియన్స్ చూసారు. కానీ మొట్టమొదటిసారి కుస్తీ ఆడడం నేడే చూసారు ఫ్యాన్స్. రామ్ చరణ్ ఈ కుస్తీ సన్నివేశాల కోసం తన శరీరాన్ని ఎలా మార్చుకున్నాడో , ఎంత కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తేనే అర్థం అయిపోతుంది. టీజర్ లో షాట్స్ అన్ని అరాచకం రేంజ్ లో ఉన్నాయి, ముఖ్యంగా రామ్ చరణ్ ని డైరెక్టర్ బుచ్చి బాబు చూపించిన విధానం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంతా బాగానే ఉంది కానీ, AR రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అభిమానులను నిరాశకు గురి చేసింది.

Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

అభిమానులు మాత్రం ఈ టీజర్ కి అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని మాత్రమే అందించాలి, లౌడ్ గా సంబంధం లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇవ్వకూడదు అంటున్నారు. అయితే టీజర్ లో రామ్ చరణ్ యాస చివర్లో ఆకట్టుకుంది. అయితే వర్షం షాట్ లో కూడా ఆయన కుస్తీ గెటప్ లోనే ఉండడం అభిమానులకు అర్థం కాలేదు. ఒక షాట్ పగలు కుస్తీ చేస్తున్నట్టు ఉంది, ఇంకో షాట్ లో రాత్రి అదే గెటప్ లో ఉన్నట్టు ఉంది. డైరెక్టర్ బుచ్చి బాబు ప్లానింగ్ ఏంటో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కి సంబంధించినది గా అనిపించింది. ఆయన ఈ చిత్రం లో రామ్ చరణ్ కి కుస్తీ కోచ్ గా కనిపించాడు.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular