Ram Charan: ‘చిరుత’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన చాలా సినిమాలతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన నెక్స్ట్ లెవెల్ లో నిలుపాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెప్పిస్తున్న టాప్ హీరోగా ఎదిగాడు. నిజానికి రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఇండియాలో గొప్ప క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నప్పటికి ఆయన మార్కెట్ మాత్రం అంత పెద్దగా పెరగలేదనే చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమాకి 1100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు రామ్ చరణ్ మరో సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టలేకపోయాడు. ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా యావరేజ్ గానే ఆడుతుండడం ద్వారా 500 నుంచి 600 కోట్ల వరకు కలెక్షన్స్ ను మాత్రమే రాబడుతున్నాయి.
అంతకు మించిన కలెక్షన్స్ రావాలి అంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. అయినప్పటికి ఆ సినిమాకు అంత తక్కువ కలెక్షన్స్ రావడంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. ఇలాగే ముందుకెళ్తే ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వరుస సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
చిరంజీవి సైతం రామ్ చరణ్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఒకవైపు అతని సినిమాలు చేసుకుంటూనే రామ్ చరణ్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
