https://oktelugu.com/

మెగా కాంబో: శంక‌ర్ – రామ్ చ‌ర‌ణ్ – దిల్ రాజు!

కొన్ని కాంబినేష‌న్ల కోసం సంవ‌త్స‌రాలు ఎదురు చూడాల్సి వ‌స్తుంది.. అయిన‌ప్ప‌టికీ కుద‌ర‌క‌పోవ‌చ్చు! మ‌రికొన్ని క‌ల‌యిక‌లు అనుకోకుండానే క్రియేట్ అయిపోతాయి! ఇప్పుడు అలాంటి సెన్సేష‌నల్ కాంబినేష‌న్ ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. అదే.. భార‌తీయ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, టాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత దిల్ రాజు కాంబో. ఈ ముగ్గురూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌నే వార్త టాలీవుడ్ స‌ర్కిల్స్ లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ […]

Written By:
  • admin
  • , Updated On : February 11, 2021 / 05:36 PM IST
    Follow us on


    కొన్ని కాంబినేష‌న్ల కోసం సంవ‌త్స‌రాలు ఎదురు చూడాల్సి వ‌స్తుంది.. అయిన‌ప్ప‌టికీ కుద‌ర‌క‌పోవ‌చ్చు! మ‌రికొన్ని క‌ల‌యిక‌లు అనుకోకుండానే క్రియేట్ అయిపోతాయి! ఇప్పుడు అలాంటి సెన్సేష‌నల్ కాంబినేష‌న్ ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. అదే.. భార‌తీయ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, టాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత దిల్ రాజు కాంబో. ఈ ముగ్గురూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌నే వార్త టాలీవుడ్ స‌ర్కిల్స్ లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

    Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !

    నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది లేదు. వెరీ రేర్ కాంబినేష‌న్ల‌ను కూడా సెట్ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. ఆయ‌న నిర్మాత‌గా డబ్బులు పెట్టి సైలెంట్ గా ఉండే ర‌కం కాదు.. క‌థ‌ను జ‌డ్జ్ చేయ‌డంలో ఆయ‌న‌ది అందెవేసిన చెయ్యి. అదే స‌మ‌యంలో నిర్మాణ విలువ‌ల విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కారు. అందుకే ద‌ర్శ‌కులతోపాటు న‌టీన‌టులు కూడా ఆయ‌న సినిమాల్లో న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటారు.

    ఇక‌, ద‌ర్శ‌కుడు శంకర్ కు తెలుగులో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న మొద‌టి చిత్రం జెంటిల్మ‌న్ నుంచి.. నిన్న‌టి రోబో 2.0 వ‌ర‌కూ ఆయ‌న సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో.. తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌ని, చేస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నారు శంక‌ర్‌. తెలుగు హీరోలు కూడా అందు‌కు సిద్ధంగానే ఉన్నారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఇది రామ్ చరణ్ తో సాధ్య‌మైంద‌ని అంటున్నారు.

    Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

    హీరోల‌తో సంబంధం లేకుండా.. త‌మ బ్రాండ్ మీద ఆడియ‌న్స్ ను థియేట‌ర్ కు ర‌ప్పించే ద‌ర్శ‌కులు చాలా కొద్ది మందే ఉన్నారు. వారిలో శంక‌ర్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఆయ‌న ఎప్పుడు సినిమా అనౌన్స్ చేసినా.. తెలుగు ఆడియ‌న్స్ కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. అలాంటిది.. ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేయ‌బోతున్నారనే వార్త‌ తెర‌పైకి రావ‌డంతో.. అది హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైర‌ల్ అయ్యింది.

    కాగా.. ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ డ్యుయ‌ల్ రోల్ లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా వ‌స్తున్న ‘ఇండియన్-2’.. మొదలై రెండున్నరేళ్లు కావస్తోంది. ప‌లు కారణాలతో జాప్య‌మైన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఆ సినిమా పూర్తిచేసిన‌ తర్వాత.. రామ్ చరణ్ సినిమాను శంకర్ మొదలు పెడతార‌ని తెలుస్తోంది. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత అనేది తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్