https://oktelugu.com/

Ram Charan and Jr NTR : జపాన్ లో రామ్ చరణ్ దే పై చెయ్యి..దరిదాపుల్లో లేని ఎన్టీఆర్ ‘దేవర’

Ram Charan and Jr NTR : మన టాలీవుడ్ నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR).

Written By: , Updated On : March 29, 2025 / 08:16 AM IST
Ram Charan , Jr NTR

Ram Charan , Jr NTR

Follow us on

Ram Charan and Jr NTR : మన టాలీవుడ్ నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR). ఈ ముగ్గురి హీరోలకు చాలా కాలం నుండి అక్కడ మంచి మార్కెట్ ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్, మగధీర తర్వాత రామ్ చరణ్ అయితే జపాన్ లో వేరే లెవెల్ కి వెళ్లిపోయారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మొదటి నుండి ఇక్కడ మంచి క్రేజ్ ఉంది. కానీ ఆయన ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలకు దరిదాపుల్లో కూడా లేడని మరోసారి రుజువు అయ్యింది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర'(Devara Movie) నిన్న జపాన్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ స్వయంగా జపాన్ కి వెళ్లి ప్రమోట్ చేసాడు. విడుదలకు ముందే పలు థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ వేశారు, రెండు మూడు థియేటర్స్ కి ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి అభిమానులతో ముచ్చటించాడు.

Also Read : ‘దేవర’ కటౌట్ కి జపాన్ అమ్మాయిలు ప్రత్యేక పూజలు..ఇదేమి క్రేజ్ బాబోయ్!

ఒక థియేటర్ లోకి ఎన్టీఆర్ వెళ్లి, అక్కడ ఒక అభిమానితో కలిసి ‘జాతర’ పాటకు డ్యాన్స్ చేయగా, దానికి సంబంధించిన వీడియో ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. ‘దేవర’ కి ఇంత క్రేజ్ ఉందా?, ఎన్టీఆర్ కూడా తన షూటింగ్స్ ని ఆపుకొని మరీ ప్రొమోషన్స్ చేసాడు. కాబట్టి ఈ చిత్రానికి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు. కానీ కట్ చేస్తే బిలో యావరేజ్ ఓపెనింగ్ వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు దరిదాపుల్లో కూడా లేదు ‘దేవర’ చిత్రం. ప్రభాస్ నటించిన ‘కల్కి’ గత ఏడాది చివర్లో జపాన్ లో విడుదలైంది. ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 3436 టికెట్స్ అమ్మిడుపోయాయి. 2023 వ సంవత్సరంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసారు.

ఈ సినిమాకు అప్పట్లో 2500 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అప్పట్లో ఆల్ టైం నాన్ #RRR హైయెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీ గా ‘రంగస్థలం’ చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 2017 వ సంవత్సరం లో విడుదలైన సినిమాని 2023 లో రిలీజ్ చేసినా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ‘రంగస్థలం’ చిత్రం కోసం రామ్ చరణ్ జపాన్ కి వెళ్ళలేదు, కనీసం ఒక వీడియో బైట్ కూడా ఆయన తరుపున రాలేదు, అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ వచ్చింది. కానీ దేవర చిత్రానికి మాత్రం ఎన్టీఆర్ ప్రొమోషన్స్ దంచి కొట్టేసాడు. దాదాపుగా అన్ని మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, కానీ మొదటి రోజు కేవలం 1200 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. ప్రొమోషన్స్ చేయకపోయి ఉండుంటే ఈ మాత్రం కూడా వచ్చేది కాదేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Also Read : జపాన్ ప్రీమియర్ షోస్ నుండి ‘దేవర’ కి సెన్సేషనల్ రెస్పాన్స్!