https://oktelugu.com/

IPL 2025: IPL టికెట్ ₹2,343.. టాక్స్ లు ₹1,657..

IPL 2025 ఐపీఎల్ (IPL) మొదలైంది అంటే చాలు మైదానాలు కిటకిటలాడుతాయి. ప్రేక్షకులతో సందడిగా మారుతాయి. ఫలితంగా జట్ల యాజమాన్యాలు పండగ చేసుకుంటాయి.

Written By: , Updated On : March 29, 2025 / 08:18 AM IST
IPL 2025 (13)

IPL 2025 (13)

Follow us on

IPL 2025: ఐపీఎల్ నిర్వహణ మొత్తాన్ని ఐపిఎల్ గవర్నింగ్ బాడి చూసుకుంటుంది. నిర్వహించే ప్రతి మ్యాచ్ బాధ్యత కూడా ఐపీఎల్ నిర్వాహక కమిటీ తీసుకుంటుంది. మ్యాచ్ నిర్వహించే మైదానానికి హోమ్ గ్రౌండ్ జట్టు యాజమాన్యం స్థానిక క్రికెట్ సంఘానికి చెల్లిస్తుంది. టికెట్ల ముద్రణ నుంచి మొదలు పెడితే ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల వరకు మొత్తం బాధ్యత జట్టు యాజమాన్యమే తీసుకుంటుంది.. ఉదాహరణకు హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానాన్ని తీసుకుంటే.. ఇది హైదరాబాద్ జట్టుకు సొంత మైదానంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతి మ్యాచ్ నిర్వహణ బాధ్యత మొత్తం హైదరాబాద్ జట్టుదే. పైగా ప్రతి మ్యాచ్ కు కోటిన్నర రూపాయలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెల్లిస్తుంది. టికెట్ల విక్రయాల నుంచి మొదలు పెడితే.. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల వరకు అన్ని కూడా హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకుంటుంది. ఇందులో బిసిసిఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యత తీసుకోవు. అయితే టికెట్ల విక్రయాల ద్వారా ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే అది టికెట్ రేటుకు దాదాపుగా సమానంగా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Also Read: ఐపీఎల్ సోషల్ బజ్: తలైవా ధోని కంటే కింగ్ కోహ్లీనే తోపు

సోషల్ మీడియా పోస్టుతో..

ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) శుక్రవారం తలపడ్డాయి. చెన్నై మైదానం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హోం గ్రౌండ్. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కు రెంట్ చెల్లించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం టికెట్ల విక్రయాలను తనే నిర్వహించింది. సహజంగా చెన్నై జట్టుకు ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి.. టికెట్లు వెంటనే విక్రయమయ్యాయి. తదుపరి మ్యాచ్లకు కూడా టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఇలా టికెట్ కొనుగోడు చేసిన ఓ చెన్నై జట్టు అభిమాని.. తనను చెన్నై జట్టు యాజమాన్యం నిలువు దోపటికి గురి చేసిందని ఆరోపించాడు.. చెన్నైలో బేసిక్ టికెట్ ధర ₹,2,343 ఉంది. వినోద పన్ను (25%) కింద 781 టాక్స్ వేశారు. మళ్లీ మొత్తం పై 28 శాతం జీఎస్టీ విధించారు. ఇందులో కేంద్రానికి 14%.. రాష్ట్రానికి 14% వెళ్తుంది. 4000 రూపాయలలో మొత్తం 1650 రూపాయలను పన్నుల రూపంలోనే ప్రభుత్వాలు స్వీకరిస్తున్నాయి. ” క్రికెట్ అంటే నాకు ఇష్టం. అభిమాన ఆటగాళ్లు ఆడే ఆటను చూడటం చాలా ఇష్టం. అందువల్లే ఎంత ఖర్చైనా పర్వాలేదని టికెట్ కొనుగోలు చేస్తే.. అందులో 1657 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారు. అసలు టికెట్ ధర 2 3 4 3 రూపాయలు మాత్రమే. ఈ స్థాయిలో పన్నులు వసూలు చేసి.. అభిమానులను సైతం నిలుపు దోపిడికి గురి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడి అభిమానుల జేబులకు చిల్లులు పెట్టడం ఎంతవరకు సమంజసం.. ఐపీఎల్ అంటే అభిమానుల జేబులకు కత్తెర వేయడమేనా” అంటూ ఆ అభిమాని ప్రశ్నించిన తీరు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.