Ram Charan and Janhvi Kapoor : ప్రస్తుతం రామ్ చరణ్(Global Star Ram Charan) ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #RC16 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ప్రారంభ దశ నుండే ఉన్నాయి. పైగా రామ్ చరణ్ కి ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వస్తున్న చిత్రమిది. అభిమానులు ఈ సినిమాతో తమ హీరో ఎలా అయినా గట్టిగా కొట్టాలి, పాన్ ఇండియా రేసులో అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటున్నారు. షూటింగ్ కార్యక్రమాలు అయితే విరామం లేకుండా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఎలా అయిన ఈ ఏడాదిలోనే షూటింగ్ ని పూర్తి చేసి, ఇదే ఏడాది విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Read : రామ్ చరణ్ ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యేవాడా..?
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్(Jhanvi Kapoor) మీద లేట్ నైట్ షూటింగ్ చేస్తున్నారట. నిన్న రాత్రి మొత్తం వీళ్లిద్దరికీ జాగరమే, రాత్రి నుండి ఉదయం వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారట. సాధారణంగా రాత్రులు షూటింగ్ చేయడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి . ఎందుకంటే రాత్రి మొత్తం లైటింగ్ ని మ్యానేజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ రామ్ చరణ్, జాన్వీ కపూర్ డైరెక్టర్ ఏది కోరితే అది, నూటికి నూరు శాతం సాహారిస్తూ ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిపిన సంగతి తెలిసిందే. అందుకు సంబందించి వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ నెల రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్నందున, ఆ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Read : గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్… కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్న దేవర హీరోయిన్!