https://oktelugu.com/

Devara Movie: ఎన్టీయార్ దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్… కారణం ఏంటంటే..?

కొరటాల శివ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో సక్సెస్ ఫుల్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 03:21 PM IST

    Ram Charan is waiting for NTR Devara movie

    Follow us on

    Devara Movie: ప్రభాస్ చేసిన మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇంతకుముందు చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒకసారి గా ఆయన సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. ఇక దాంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నాడు. అందుకోసమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాలోని ప్రతి సీన్ ని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్లు గా తెలిసింది. మరి మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ చరణ్ కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.

    ఇక దానికి కారణం ఏంటి అంటే దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఈ సినిమాతో కనక తనకి సక్సెస్ పడితే ఆమె పాన్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకుంటుంది. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు తో చేస్తున్న సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది కాబట్టి ఈ సినిమా మీద కూడా ఆటోమేటిగ్గా భారీ అంచనాలు పెరుగుతాయి.

    తద్వారా బాలీవుడ్ లో వాళ్ళకి ఎక్కువగా కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రామ్ చరణ్ కూడా దేవర సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో వీళ్ళ మధ్య చాలా మంచి సన్నిహిత్యం అయితే ఉంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ను కూడా ఏర్పాటు చేసిందనే చెప్పాలి…

    ఇక ఇప్పటికి కూడా వీళ్లు మంచి ఫ్రెండ్స్ గా ఉండటమే కాకుండా ఒకరి సినిమాలు మరొకరు చూస్తూ ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని కొడితే పాన్ ఇండియాలో స్టార్ హీరో గా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఎన్టీయార్ కొరటాల ఇద్దరు ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక వెపన్ (గొడ్డలి) పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆయుధ పూజ అంటు దానికి ట్యాగ్ ని కూడా ఆడ్ చేయడం విశేషం…