Senior Director: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ముందుకు తీసుకెళుతున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంతకు ముందు భారీ సక్సెస్ లను అందుకొని ఇప్పుడు సక్సెస్ లు లేక సతమతమవుతున్నారు. ఇక వాళ్లు కనక ఒకసారి కంబ్యాక్ ఇచ్చినట్టయితే ఇండస్ట్రీలో మరోసారి వారిని మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా సినిమాలను సక్సెస్ చేయగలిగే సత్తా వాళ్ళ దగ్గర ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆ దర్శకులలో ముందుగా పూరిజగన్నాథ్ గురించి చెప్పుకోవాలి. ఈయన తన కెరియర్ ముగిసిపోయింది అనుకున్న ప్రతిసారి ఒక భారీ కంబ్యాక్ ఇస్తు ఇండస్ట్రీలో తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు.
మరి ఇప్పుడు కూడా లైగర్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో తను అనుకున్న కంబ్యాక్ దక్కుతుంది లేదా అనే ఉద్దేశ్యం లో తన అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో కనక ఆయన కంబ్యాక్ ఇచ్చినట్టైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక మరొక డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలి. ఈయన మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను అలరించడం లో చాలా వరకు విఫలమైంది. ఇక దాంతో త్రివిక్రమ్ మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే అంతకుముందు అల్లు అర్జున్ తో చేసిన అలా వైకుంఠపురంలో సినిమాతో భారీ సక్సెస్ దక్కడమే కాకుండా ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసింది.
అయినప్పటికీ గుంటూరు కారం సినిమా ఫ్లాప్ తో ఆయన మీద భారీ విమర్శలైతే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మరోసారి స్టార్ హీరో తోనే సినిమా చేసి ఒక భారీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. నిజానికి ఆయన కనక కంబ్యాక్ ఇస్తే ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…