Ram Charan With Bollywood Top Director: ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..నిన్న మొన్నటి వరుకు కేవలం తెలుగు లో ఒక స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్..#RRR సినిమా తో పాన్ ఇండియా లెవెల్ ని పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు..రామరాజు పాత్రలో ఆయన చూపించిన నటన అద్భుతం..ముఖ్యంగా అతని పాత్ర వేషధారణ శ్రీ రాముని తో పోలి ఉండడం వల్ల ఉత్తరాది ప్రేక్షకులు రామ్ చరణ్ ని పూజించే స్థాయి లో అభిమానించడం ప్రారంభించారు..#RRR ద్వారా వచ్చిన ఈ క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకి దూసుకుపోతున్నాడు రామ్ చరణ్..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ గారితో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు చెయ్యడానికి గౌతమ్ తిన్నూరి, లోకేష్ కనకరాజ్, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ క్యూ లో ఉన్నారు..ఈ ప్రాజెక్ట్స్ తో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్.

Also Read: Vijay Varasudu Movie: ‘వారసుడు’ కథ పై వదంతులు.. సీఎం జయలలిత వారసుడిగా స్టార్ హీరో ?
ఇక అసలు విషయానికి వస్తే అమిష్ త్రిపాఠి అనే ఒక పాపులర్ రచయిత తానూ రాసిన ‘లెజెండ్ ఆఫ్ సాహిల్ దేవ్’ అనే పుస్తకం ని సినిమాగా తెరకెక్కించబోతున్నాడు అని కొనేళ్ల క్రితం ఆయనే స్వయంగా అధికారిక ప్రకటన చేసాడు..ఈ సినిమాలో సాహిల్ దేవ్ అనే మహాయోధుని పాత్ర కోసం బాలీవుడ్ లో చాలామంది హీరోల పేర్లనే అనుకున్నారు..కానీ #RRR సినిమా చూసిన తర్వాత ఆయన ఆలోచన మారిపోయింది..ఈ మహావీరుడి పాత్రని కేవలం రామ్ చరణ్ మాత్రమే చెయ్యగలడు అని ఆయన బలంగా నమ్ముతున్నాడట..ఇటీవలే అమ్రిత్ సర్ లో షూటింగ్ చేసుకుంటున్న రామ్ చరణ్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడట..స్టోరీ మొత్తం విన్న తర్వాత రామ్ చరణ్ కి కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..ఇంతకీ ఈ సాహిల్ దేవ్ ఎవరు అంటే, వందల ఏళ్ళ క్రితం మన భారత దేశానికీ చక్రవర్తిగా సాహిల్ దేవ్ ఉండేవారట..ఆయనని అప్పట్లో అందరూ ‘భారత రక్షకుడు’ అని పిలిచేవారట..ఆయన వీరోచిత గాధను వింటే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది..అలాంటి కథ సినిమా రూపం లో చేరిస్తే ప్రభంజనం సృష్టించడం ఖాయం అని..కచ్చితంగా ఆ మహావీరుడి చరిత్ర ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అమిష్ త్రిపాఠి కోరిక..మరి ఆయన రాసిన ఆ పుస్తకాన్ని ఎంత గొప్పగా వెండితెర మీద ఆవిష్కరిస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Jabardasth Naresh: జబర్ధస్త్ నరేష్ జీవితంలో ఆ విషాదం పూడ్చలేనిదట.. అతడి వయసు ఎంతో తెలుసా?




[…] […]