Homeఎంటర్టైన్మెంట్Ram Charan injured: రామ్ చరణ్ కి గాయాలు.. ఆగిపోయిన 'పెద్ది' షూటింగ్.. ప్రస్తుతం ఆరోగ్య...

Ram Charan injured: రామ్ చరణ్ కి గాయాలు.. ఆగిపోయిన ‘పెద్ది’ షూటింగ్.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Ram Charan injured: మెగా అభిమానులందరూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) మూవీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అనే క్యూరియాసిటీ కేవలం అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఉన్నాయి. ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక టీజర్ రాబోతుంది. అభిమానులు ఎన్ని […]

Ram Charan injured: మెగా అభిమానులందరూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) మూవీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అనే క్యూరియాసిటీ కేవలం అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఉన్నాయి. ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక టీజర్ రాబోతుంది. అభిమానులు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి, ఈ టీజర్ అంతకు మించే ఉంటుందని మేకర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే మేకర్స్ ee చిత్రాన్ని ఏప్రిల్ 30 న విడుదల చేసేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మూవీ యూనిట్ మొతం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఒకపక్క షూటింగ్, మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో డైరెక్టర్ బుచ్చి బాబు ఊపిరి ఆడనంత బిజీ గా ఉన్నాడు.

ఇలాంటి సమయం లో ఈ సినిమా షూటింగ్ కి అంతరాయం కలిగింది. నిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న సమయం లో రామ్ చరణ్ నుదుటిపై గాయం అయ్యిందట. ఆ గాయానికి నాలుగు కుట్లు కూడా పడినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందట. అయితే రామ్ చరణ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, డాక్టర్లు కేవలం ఒక్క రోజు విశ్రాంతి మాత్రమే తీసుకోమని చెప్పారని, రేపటి నుండి ఆయన యదావిధిగా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పార్ట్ ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. 27 తో ఈ క్లైమాక్స్ షూటింగ్ ముగుస్తుందని అనుకున్నారు కానీ, ఇప్పుడు ఒక రోజు సమయం ఎక్కువ పట్టబోతోంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యాక, కేవలం ఒకే ఒక్క ఐటెం సాంగ్ షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది.

ఈ ఐటెం సాంగ్ లో ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించబోతుంది. ఆమెతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుంది. త్వరలోనే ఈ పాటని కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా, చాలా జాగ్రత్తగా, టైట్ షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి సమయం లో ఒక రోజు షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. కేవలం ఒక్క రోజు షూటింగే ఆగింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క రోజు షూటింగ్ తాలూకా ప్రభావం చాలా గట్టిగానే ఉండబోతుంది. మరి బుచ్చి బాబు ఎలా మ్యానేజ్ చేయబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper