Ram Charan- Vikram Sequel: ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా చిత్రంగా విక్రమ్ నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీక్ కూడా ముగియకుండానే విక్రమ్ లాభాలు కురిపిస్తుంది. కేరళలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ సాధించిన తమిళ చిత్రంగా విక్రమ్ నిలిచింది. ఓవర్సీస్ లో కూడా విక్రమ్ జోరు కొనసాగుతోంది. యూఎస్ లో $ 2 మిలియన్ వసూళ్లకు చేరుకున్న విక్రమ్ ఇండియన్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో సత్తా చాటుతుంది.
ఈ క్రమంలో విక్రమ్ సీక్వెల్ పై జోరుగా ప్రచారం సాగుతుంది. లోకేష్ కనకరరాజ్ విక్రమ్ మూవీలో సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. విక్రమ్ డ్రగ్ మాఫియాను అంతం చేస్తాడు. ఆ మాఫియా సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి లాస్ట్ లో రోలెక్స్ సర్ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమ్ 2లో సూర్య విలన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
కాగా విక్రమ్ 2లో హీరో రామ్ చరణ్ భాగం కానున్నారట. విక్రమ్ మూవీలో కమల్ తన కొడుకుని చంపిన మాఫియా, పోలీస్ అధికారులపై పగ తీర్చుకుంటాడు. ఇక ఈ కథలో కమల్ మనవడిగా ఓ పసికందును చూపించారు. క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి ఆ చిన్నపిల్లాడిని కిడ్నాప్ చేసి, తన కంటైనర్ ఆచూకీ తెలుసుకోవాలనుకుంటాడు. అతికష్టం మీద పోరాడి కమల్ మనవడిని కాపాడుకుంటాడు. సీక్వెల్ లో మనవడిగా రామ్ చరణ్ కనిపిస్తాడట. తాత కమల్ తో కలిసి విలన్స్ అంతు చూస్తాడట.
కోలీవుడ్ వర్గాల్లో ఈ పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజంగా చరణ్ ఈ సీక్వెల్ లో నటిస్తే బాక్సాఫీస్ గల్లంతే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. అనంతరం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. విక్రమ్ సీక్వెల్ లో రామ్ చరణ్ నటించడం నిజమైనా.. అది కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. దర్శకుడు లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తలపతి విజయ్ తో చేస్తున్నారు.
Also Read:Bigg Boss Sunny: బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీపై రౌడీషీటర్ దాడి.. అసలు వివాదమేంటి? ఎందుకు జరిగింది?