
వరుస సినిమాలతో విజయాలు సాధిస్తున్న కొరటాల శివ కి నిజజీవితంలో కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఇష్టం. అది ఆయన తీసిన సినిమాల్లో స్పష్టంగా కనపడుతుంది ఇక తాజాగా ఆయన చిరంజీవి తో తీస్తున్న “ఆచార్య ” చిత్రం లో ఒక నక్సలైట్ పాత్ర ఉండబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆ పాత్ర కథా పరంగా లెక్చరర్ గా మారుతుంది. నక్సలైట్ గా ఉన్న వ్యక్తి …లెక్చరర్ గా ఎలా మారాడు అన్నదే ఈ చిత్రం యొక్క కథ లోని కీలకాంశం అని తెలుస్తోంది .అలా రెండు రకాలుగా విభిన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించ నున్నాడు. అంతే కాదు రామ్ చరణ్ కి ఈ చిత్రం లో రామ్ చరణ్ కి రెండు పాటలు ఉంటాయని తెలుస్తోంది.అందులో ఒక పాట మామూలు డాన్స్ సాంగ్ కాగా రెండో పాట ఎమోషనల్ గా సాగుతుందట … కాగా ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా నటిస్తాడని అంటున్నారు.
పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలా?
ఇక ఆచార్య చిత్రంలోచిరంజీవి సరసన కాజల్ , రాం చరణ్ సరసన సరసన రష్మిక మందన్న హీరోయిన్ లుగా నటించ నున్నారు. అలాగే చాలా గ్యాప్ తరవాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించటం ఈ చిత్రంలో ఉన్న మరో విశేషం . .