Johnny Master
Johnny Master : ఒక సాధారణ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన జానీ మాస్టర్, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి, అంచలంచలుగా ఎదుగుతూ, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని, నేషనల్ అవార్డు గెలుచుకునే రేంజ్ కి ఎదిగిన తీరుని మనమంతా చూసాము. దశాబ్దం నుండి ఎంతో కష్టపడి ఆయన ఈ స్థానం కి చేరుకున్నాడు. కానీ ఒక్క అమ్మాయి కారణంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం గంగలో కలిసిపోయాయి. చివరికి నేషనల్ అవార్డుని కూడా వెనక్కి ఇచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అసిస్టెంట్ గా పని చేసిన శ్రేష్టి వర్మ అనే అమ్మాయి, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు ని పెట్టడం, ఆ కేసు కారణంగా ఆయన నెలరోజుల పాటు రిమాండ్ లో గడిపి బెయిల్ మీద బయటకి రావడం వంటివి మనమంతా చూసాము. బయటకి వచ్చిన తర్వాత ఆయనకు అవకాశాలు ఒకప్పటి రేంజ్ లో అయితే రావడం లేదు.
కానీ ఇప్పుడిప్పుడే ఆయన మళ్ళీ కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన ఒక పాటకు కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు జానీ మాస్టర్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈయన కారణంగానే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. కంపోజ్ చేసిన తొలి పాటే పెద్ద హిట్ అవ్వడంతో, ఇక జానీ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన బెయిల్ నుండి బయటకి వచ్చిన తర్వాత పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేయలేదు కానీ, అంతకు ముందు ఈయన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం లో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసాడు. ఈ పాటకు దాదాపుగా 30 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. ‘ధోప్’ అంటూ సాగే పాట ‘గేమ్ చేంజర్’ చిత్రానికే హైలైట్ కాబోతుందట.
ఈ విషయాన్నీ స్వయంగా జానీ మాస్టర్ ఇటీవల మీడియా తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఈ పాట తన కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని, వింటేజ్ రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్స్ తో పాటు, వింటేజ్ శంకర్ మార్క్ స్టైల్ లో ఈ పాట ఉండబోతుందని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. తనకు ఏ హీరో అయితే అవకాశాలు ఇచ్చి ఇంత దూరం ఎదిగేలా చేసాడో, ఇప్పుడు ఆయన బెయిల్ నుండి బయటకి వచ్చిన తర్వాత అదే హీరోతో కంపోజ్ చేసిన సాంగ్ కి సంబంధించిన సినిమా మొదట విడుదల కాబోతుంది. ఆయన చెప్పినట్టుగా ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే, జానీ మాస్టర్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోతాది. ఆయన కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇస్తాది. మరో రెండు మూడు రోజుల్లో ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ మన ముందుకు రాబోతుంది.