pushpa : సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు ఎలాంటి పొజిషన్ లో ఉంటారో ఎవ్వరు చెప్పలేరు. కారణం ఏంటంటే ఒక మంచి సినిమా పడితే ఏ హీరో అయినా కూడా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు. అదే ఒక ఫ్లాప్ సినిమా వచ్చినట్టైతే స్టార్ హీరో కూడా తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది…
పుష్ప సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఒక్కసారిగా తన మార్కు ను చూపించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అతను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి భారీ విజయాలను సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే ఆయన ఇమేజ్ తార స్థాయికి చేరిపోయింది. పాన్ ఇండియాను శాసించే హీరోగా తన ఎదగబోతున్నాడు అంటూ చాలా వార్తలైతే వినిపించాయి. ఇక దానికి తగ్గట్టుగానే ‘పుష్ప 2’ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ ని పెట్టి ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన పోరాటం చేస్తూ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నందుకు గాను ఆయనకు సపోర్టుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఆ ప్రచారంలో పాల్గొనలేదు. ఇక దానికి తోడుగా నంద్యాల వైసిపి క్యాండేట్ అయిన శిల్ప రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వాళ్ల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి వైసీపీ బ్యాచ్ అల్లు అర్జున్ మనవాడు అంటూ అతన్ని సపోర్ట్ చేయడమే కాకుండా ఇన్ డైరెక్ట్ గా మెగా ఫ్యామిలీకి పోటీని ఇస్తున్నాడు అంటూ ప్రచారం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ అండ లేకుండా ఎదిగే కెపాసిటీ ఉన్న హీరో అల్లు అర్జున్ అంటూ అతనిని పోగడడం స్టార్ట్ చేశారు. ఇక మొత్తానికైతే వైసీపీ 2024వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది…
ఇక దాంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా 21 స్థానంలో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి చూపించాడు… ఇక వైసిపి బ్యాచ్ కి ఏం చేయాలో తెలియక అప్పటినుంచి మెగా ఫ్యామిలీని డి గ్రేడ్ చేస్తూ అల్లు అర్జున్ ని హైప్ చేస్తే వాళ్లలో వల్లే ఇబ్బంది పడతారు అని వైసిపి బ్యాచ్ అలా చేశారు.
ఇక అల్లు అర్జున్ ను పైకి లేపే ప్రయత్నం అయితే చేశారు. ఇక పుష్ప 2 సినిమా కోసం వాళ్లు విపరీతమైన ప్రచారం కూడా చేశారు. మొత్తానికైతే సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది. కానీ పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. దాంతో అల్లు అర్జున్ ను రీసెంట్ గా అరెస్టు చేశారు.
ఇక అప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకి అండగా నిలవడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మధ్య మళ్లీ సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇక దీంతో ఇదంతా చూస్తున్న వైసిపి బ్యాచ్ పుష్ప నిన్ను సపోర్ట్ చేసినందుకు మేము ఎర్రి పుష్పాలమయ్యాం అంటూ వాళ్లకు వాళ్లే కామెంట్ చేసుకుంటున్నారు… ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా వైసిపి బ్యాచ్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు…