Pawan Kalyan Khushi : రీ-రిలీజ్ అవుతున్న ‘ఖుషి’ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా?

Pawan Kalyan Khushi : ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు పుట్టిన రోజులను పురస్కరించుకొని ‘జల్సా’ మరియు ‘పోకిరి’ సినిమాలను రీ రిలీజ్ చేసారు..ఈ రెండు సినిమాలకు అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది..పోకిరి సినిమాకి కోటి 75 లక్షల రూపాయిలు గ్రాస్ రాగా, జల్సా సినిమాకి మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ రెండు సినిమాలు బాగా క్లిక్ అవ్వడం తో వరుసపెట్టి పాట సూపర్ హిట్ సినిమాలను రీ […]

Written By: NARESH, Updated On : December 24, 2022 9:52 pm
Follow us on

Pawan Kalyan Khushi : ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు పుట్టిన రోజులను పురస్కరించుకొని ‘జల్సా’ మరియు ‘పోకిరి’ సినిమాలను రీ రిలీజ్ చేసారు..ఈ రెండు సినిమాలకు అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది..పోకిరి సినిమాకి కోటి 75 లక్షల రూపాయిలు గ్రాస్ రాగా, జల్సా సినిమాకి మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ రెండు సినిమాలు బాగా క్లిక్ అవ్వడం తో వరుసపెట్టి పాట సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చెయ్యడానికి ముందుకొచ్చారు దర్శకనిర్మాతలు.

 

ఒక్క సినిమా కూడా ఈ రెండు చిత్రాలు సృష్టించిన మేనియాని రీ క్రియేట్ చేయలేకపోయాయి..కానీ మేనియా ని మరోసారి రిపీట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిద్ధం అయ్యారు..న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 వ తారీఖున ‘ఖుషి’ సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాత అధికారిక ప్రకటన చేసాడు..ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానులు బుక్ మై షో ని ఓపెన్ చేసి ఖుషి సినిమా కోసం వెతుకుతూ ఉన్నారు.

అభిమానుల తాకిడికి ఖుషి సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తున్న అవతార్ 2 ని కూడా పక్కకినెట్టి టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టింది..సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉండడం తో మూవీ టీం రేపటి నుండి గ్రాండ్ గా ప్రొమోషన్స్ ప్రారంభించబోతుంది..రేపు ఆ చిత్ర నిర్మాత AM రత్నం ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు..ఇక ఈ సినిమా ద్వారా మరో సరికొత్త ట్రెండ్ ప్రారంభం అయ్యింది..అదేమిటంటే ఇది వరకు కొత్త సినిమాలకు మాత్రమే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లు జరిగేవి.

కానీ మొట్టమొదటి సారిగా రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఒక సినిమా రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ జరిగింది..ప్రపంచవ్యాప్తంగా 31 వ తారీఖున విడుదలవ్వబోతున్న ఖుషి సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు కోట్ల రూపాయలకు జరిగిందట..అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.