Ram Charan : ఇండియాలో ఉన్న చాలామంది నటులు గొప్ప సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలి అంటే అందులో దర్శకుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. హీరో మనకు స్క్రీన్ మీద కనిపించినప్పటికి ఆయన ఏ లెవెల్లో యాక్టింగ్ చేయాలి, ఎలా ప్రేక్షకుడిని మెప్పించి అనేది మాత్రం దర్శకుడు చెబుతూ ఉంటాడు…
మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ (Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాలని ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు(Buchhi Babu) డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే బుచ్చిబాబు తో సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఈ మూవీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాని కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్ తో కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేస్తాడా? లేదంటే మధ్యలో వేరే ఒక సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : అంతరిక్షం లోకి రామ్ చరణ్ ‘పెద్ది’..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయామనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకతైతే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఇక మంచి కథలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులను పలకరిస్తూ ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాడా? లేదంటే డీలా పడిపోతాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక తన తోటి హీరోలైతే వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు ఇంకా కొంతవరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి.
ఈ సంవత్సరం వచ్చిన (Game Changer) మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రామ్ చరణ్ మార్కెట్ కొద్ది వరకు తగ్గింది. మరి గ్లోబల్ స్టార్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : మరోసారి కాజల్ అగర్వాల్ తో రామ్ చరణ్ రొమాన్స్..కానీ ట్విస్ట్ ఏమిటంటే!