Dil Raju : దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్(Shirish) నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్(Global Star Ram Charan) పై , గేమ్ చేంజర్ చిత్రం పై చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపాయి. సినిమా ఫ్లాప్ అయ్యాక రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ మమ్మల్ని గాలికి వదిలేసారు, కనీసం పట్టించుకోలేదు అంటూ కామెంట్ చేశారు. దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తీవ్రమైన నిరసన వ్యక్తం చేసాడు. డైరెక్టర్ శంకర్ ని , నిన్ను నమ్మి రామ్ చరణ్ #RRR లాంటి భారీ హిట్ తర్వాత నాలుగేళ్ల డేట్స్ ని కేటాయించాడు. మధ్యలో రెండు సినిమాలు చేసే అవకాశం వచ్చినా నీ మీద గౌరవం తో చెయ్యలేదు. దానికి నువ్వు మా హీరో కి ఇచ్చే గౌరవం ఇదా అని అభిమానులు దిల్ రాజు ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.
అయితే కాసేపటి క్రితమే రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు కి, అతని సోదరుడు శిరీష్ కి వార్నింగ్ ఇస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ లో ‘సినిమా అనేది ఒక ఒక వ్యాపారం. ఒక్కోసారి నష్టాలు వస్తుంటాయి, ఒక్కోసారి లాభాలు వస్తుంటాయి. మీ సినిమాలన్నీ కేవలం మీ ప్రొడక్షన్ హౌస్ బ్రాండ్ వేల్యూ వల్లనే హిట్ అయ్యాయి అని చెప్పుకొని తిరిగే దిల్ రాజు గారు,ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. 1 నేనొక్కడినే చిత్రం అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ అయ్యింది, ఆ సినిమా నిర్మాతలు మీలాగా ఇలా బయటకు వచ్చి హీరో మీద కామెంట్స్ చేశారా?, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఫ్లాప్ అయ్యినప్పుడల్లా వాళ్ళు ఇలా మీడియా ముందుకొచ్చి హీరోల మీద ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారా?’.
‘గత సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ గారి సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. నిర్మాత ఎందుకు బయటకి వచ్చి వెంకటేష్ గారి మీద కామెంట్స్ చేయలేదు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ కదా?, వెంకటేష్ గారికి ఎంత డబ్బులిచ్చారు?, ముందు అనుకున్నదే ఇచ్చారా?,లేక ఎక్కువ ఏమైనా ఇచ్చారా?,దర్శకుడు శంకర్ తో సినిమాని సెట్ చేసింది ఎవరు?, సంవత్సరం లో పూర్తి అవ్వాల్సిన సినిమాని మూడు సంవత్సరాలు సాగదీసింది ఎవరు? , #RRR తర్వాత తనతో సినిమా చేయడానికి ఇండస్ట్రీ లో టాప్ నిర్మాతలందరూ క్యూలు కట్టినా, రామ్ చరణ్ వారిని కాదని మీకు అవకాశం ఇచ్చినందుకు ఇలా విషం చిమ్ముతారా?, మూడేళ్లు ఎదురు చూసిన సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధలో మేమంటే, ప్రతీ ఇంటర్వ్యూ లో దాని ప్రస్తావన తీసుకొని వస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతారా?, ఇదే మీకు చివరి హెచ్చరిక, ఇంకోసారి రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.