Ram Charan on Rahman Music: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మొదట ఆ సినిమా కథ బాగుండాలి. ఇక ఆ స్టోరీ కి తగ్గట్టుగా కథనం కుదిరినప్పుడే దర్శకుడు దానిని స్క్రీన్ మీద పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాడు. అలా చేసినప్పుడే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు చాలా వరకు క్లారిటీ గా వ్యవహరించినప్పటికి మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగినప్పుడే సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ లేకుండా సినిమాని చూడడం ఎంత కష్టమో ఒక సినిమాకి సరైన మ్యూజిక్ కుదరకపోతే ఆ సినిమాను చూడడం అంతకంటే కష్టం… కాబట్టి సాంగ్స్ విషయంలో కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోరు బాగుండటం వల్ల సూపర్ సక్సెస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు భారీ విజయాలను సాధించాలంటే మ్యూజిక్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలో వాళ్ళు ఏఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.
Also Read: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘కింగ్డమ్’ వసూళ్లు..ఎంత వచ్చిందంటే!
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ అంత మంచి ఫామ్ లో అయితే లేడు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో రెహమాన్ మ్యూజిక్ తోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన ఎలాంటి కేర్ తీసుకోబోతున్నాడు అనేది కీలకమైన అంశముగా మారింది.
పెద్ది సినిమా ఫుల్ మాస్ సినిమా ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు ఒక ఫుల్ లెంత్ మాస్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఈ సినిమాకు ఆయన్ని తీసుకోవడమే పెద్ద మైనస్ అంటూ మొదట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఇస్తున్న సాంగ్స్ విషయంలో రామ్ చరణ్ అంత సంతృప్తిగా లేనట్టుగా తెలుస్తోంది.
Also Read: బోయపాటి శ్రీను మీద పంచ్ వేసిన సందీప్ రెడ్డి వంగ…వైరల్ వీడియో…
మరి ఇలాంటి సందర్భంలో రెహమాన్ రామ్ చరణ్ ను మెప్పించడానికి కొన్ని మంచి ట్యూన్స్ ను ఇస్తున్నారట. ఇప్పటికే బుచ్చిబాబు మూడు సాంగ్స్ ను ఫైనల్ చేశాడట. అందులో ఏ సాంగ్ కూడా రామ్ చరణ్ కి పెద్దగా నచ్చలేదనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు గానీ, మొత్తానికైతే రామ్ చరణ్ రెహమాన్ మ్యూజిక్ పట్ల కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…