Dharmasthala Twist: వందల మంది చనిపోయారు.. ఎందుకు చనిపోయారో తెలియదు.. వారందరిని నేనే పాతిపెట్టాను.. నేను పాతిపెట్టిన చోట పుర్రెలు దొరుకుతాయి. ఎముకలు లభిస్తాయి.. ఆమధ్య ఓ కార్మికుడు పోలీసులకు చెప్పడం.. అది కాస్త సంచలనంగా మారడంతో ధర్మస్థల లో ఏం జరిగిందో ఉత్కంఠ గా మారింది.
Also Read: పహల్గా ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి 3 నెలలు ఎందుకు పట్టింది?
కొందరు మహిళలని తీవ్రంగా హింసించి.. వారిని అంతం చేసి.. ఆ తదుపరి వారి మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఓ కార్మికుడు చెప్పడంతో ఆ విషయం కాస్త సంచలనంగా మారింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఆ కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా తవ్వకాలు మొదలుపెట్టింది. తొలి ఆరు రోజుల వరకు అతడు చెప్పిన ప్రాంతాలలో జరిపితే ఎముకలు, పుర్రెలు లభించాయి. ఆ తర్వాత అతడు చెప్పిన ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతుంటే పుర్రెలు, ఎముకలు లభించడం లేదు.. దీంతో ఆ పారిశుద్ధ్య కార్మికుడు అబద్ధం చెబుతున్నాడా.. అతడు చెప్పిన చోట ఎందుకు ఎముకలు, పుర్రెలు లభించడం లేదని అధికారులు అంతర్మాథనంలో పడ్డారు. పైగా అక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే అతడు చెప్పినచోట ఎటువంటి ఆనవాళ్లు లభించని నేపథ్యంలో.. తవ్వకాలు నిలిపివేస్తారా.. ఈ కేసులో తదుపరి ఎటువంటి అడుగులు వేస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Also Read: ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ వీడియో
ధర్మస్థలి ప్రాంతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. పైగా ఈ ప్రాంతం గోవాకు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో సముద్రం కూడా ఉండడంతో పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ధర్మస్థలి ప్రాంతంలో మంజునాథ స్వామి కొలువై ఉన్నాడు. అయ్యప్ప మాలధారులు ఇక్కడ తమ ఇరుముడిని ఇక్కడ విసర్జిస్తారు. గడచిన రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో దాదాపు 450 మంది మిస్సింగ్ అయినట్టు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇక్కడ పనిచేస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడు తాను వందల శవాలను పాతిపెట్టానని చెప్పాడు. వారంతా మహిళలని.. వారందరినీ ఎందుకు చంపారో తనకు తెలియదని.. కాకపోతే వారి శవాలను తను పాతిపెట్టానని ఆ కార్మికుడు చెప్పాడు. దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది. అయితే ఈ ప్రాంతంలోనే మహిళలను ఎందుకు పాతిపెట్టారు.. వారందరినీ ఎందుకు హింసించారు.. ఎందుకు చంపి ఇక్కడకు తీసుకొచ్చారు.. అప్పుడు శవాలను పాతిపెట్టిన పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు ఈ వివరాలను బయటకు చెప్పలేదు.. అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.