https://oktelugu.com/

Ram Charan: మరదలి పెళ్ళిలో డాన్స్ ఇరగతీసిన రామ్ చరణ్…

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాస్‌ బిజీ షెడ్యూల్‌కు ఇటీవల కాస్త బ్రేక్ ఇచ్చాడు. తన సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్పాల మ్యారేజ్‌కు చెర్రీ తన వైఫ్‌తో కలిసి హాజరయ్యాడు. అనుష్పాల-అర్మాన్ ఇబ్రహీంల మ్యారేజ్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తన మరదాలితో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 01:15 PM IST
    Follow us on

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాస్‌ బిజీ షెడ్యూల్‌కు ఇటీవల కాస్త బ్రేక్ ఇచ్చాడు. తన సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్పాల మ్యారేజ్‌కు చెర్రీ తన వైఫ్‌తో కలిసి హాజరయ్యాడు. అనుష్పాల-అర్మాన్ ఇబ్రహీంల మ్యారేజ్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తన మరదాలితో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న అనుష్పాల-అర్మాన్ ఇబ్రహీం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇకపోతే ఈ వేడుకలో రామ్ చరణ్ తేజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఎంగేజ్‏మెంట్ నుంచి పెళ్లి వరకు అన్ని గ్రాండ్ గా చేశారు. ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

    Ram Charan Dance

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…

    ఈ పెళ్ళికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసారు. ఇంటి అల్లుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లి హంగామా చేశారు. ఇక సంగీత్ లో అందరూ డ్యాన్సులు వేసి అలరించారు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే రామ్ చరణ్‌ ఉపాసన చెల్లి, తన మరదలితో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ తన మరదలితో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. మొత్తానికి ఈ పెళ్ళిలో సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్ వీడియోలో చాలా జోష్‌గా కనబడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ఇక రామ్ చరణ్, తారక్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది.

    Also Read: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా … కారణం ఏదైనా ఉందా