https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: ఇదేం శాడిజం రా బాబు… వాళ్ళిద్దరినీ ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కో భాగోతం. ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయడం కోసం ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. కోపం, ప్రేమ, స్నేహం, చిరాకు వంటి ఎమోషన్స్ దీనిలో భాగమే అని చెప్పాలి. కాగా హౌస్ లో అందరు కంటెస్టెంట్స్ ది ఒక తీరు, షణ్ముఖ్ ది మరొక తీరు. ఈ యూట్యూబ్ స్టార్ గేమ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా షణ్ముఖ్ హౌస్ లో సిరికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2021 / 01:08 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కో భాగోతం. ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయడం కోసం ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. కోపం, ప్రేమ, స్నేహం, చిరాకు వంటి ఎమోషన్స్ దీనిలో భాగమే అని చెప్పాలి. కాగా హౌస్ లో అందరు కంటెస్టెంట్స్ ది ఒక తీరు, షణ్ముఖ్ ది మరొక తీరు. ఈ యూట్యూబ్ స్టార్ గేమ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా షణ్ముఖ్ హౌస్ లో సిరికి చూపిస్తున్న టార్చర్ మాములుగా లేదు.

    Bigg Boss 5 Telugu

    సిరికి షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ అంటే.. ఇద్దరూ ఒకే బెడ్ పై పడుకునేంత. హౌస్ లో సిరిని ఎవరైనా ఏదైనా అంటే షణ్ముఖ్ అసలు ఊరుకోడు. ఆమె పక్క వకాల్తా పుచ్చుకొని గొడవకు దిగిపోతాడు. ఆమెను ఏడిపించినా, నవ్వించినా… అది నేనే చేయాలి అన్నట్లు షణ్ముఖ్ వ్యవహారం ఉంటుంది. నిజానికి హౌస్ లో ఎక్కువగా సిరిని మానసికంగా వేధించేది షణ్ముఖ్ కావడం గమనార్హం. ఒకటికాదు రెండు కాదు పదులసార్లు సిరికి మెంటల్ టార్చర్ చూపించాడు. కోరి దగ్గరకు వస్తుంటే.. నాకు నువ్వొద్దు దొబ్బేసేయ్ అని ముఖానే చెబుతాడు.

    ఇంకో వారం రోజుల్లో షో ముగియనుండగా.. ఇప్పటికీ షణ్ముఖ్ తీరులో మార్పు రాలేదు. గురువారం ఎపిసోడ్ లో కూడా షణ్ముఖ్, కారణం లేకుండా సిరితో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళతోనే ఉండు, నా దగ్గరకు రాకు, నువ్వు కూడా ఆ బ్యాచ్ తో చేరిపోయావ్ అంటూ అలిగాడు. నా దగ్గర్నుండి వెళ్ళిపో అని సిరి పై ఫైర్ అయ్యారు. స్టార్స్ గెటప్స్ టాస్క్ లో భాగంగా సన్నీతో సిరి డాన్స్ చేసింది. అలాగే సన్నీ, మానస్, కాజల్ ఓ చోట ఉండగా, వాళ్ళ దగ్గర సిరి కూర్చోవడం షణ్ముఖ్ చూశాడు.

    Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు

    అది నచ్చని షణ్ముఖ్ వెంటనే దాని రియాక్షన్ చూపించేశాడు. సరే నువ్వొద్దు నాకు అన్నవాడు… అదే మాట మీద ఉంటాడా అంటే.. అదీ లేదు. కాసేపటి తర్వాత సిరి దగ్గరకు పోతాడు, తప్పునాదే సారీ రా అంటూ.. దగ్గరవుతాడు. మళ్ళీ హగ్గులు షురూ. వీళ్ళ రెగ్యులర్ భామాకలాపం చూసి విసిగిపోయిన ఫ్యాన్స్… బిగ్ బాస్ గారూ… ముందు ఆ ఇద్దరినీ బయటకు పంపించండి సార్ అని వేడుకుంటున్నారు. అదే సమయంలో షణ్ముఖ్ ప్రవర్తన చూసి… ఇదేం శాడిజం రా బాబూ.. అంటూ బుర్రలు గోక్కుంటున్నారు.

    అయితే హౌస్ నుండి ఇద్దరిని పంపే ఛాన్స్ లేదు. ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఐదుగురు ఫైనల్ కి వెళతారు. హౌస్ లో ఇద్దరు అమ్మాయిలు మాత్రం మిగిలారు. కాజల్, సిరిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతుంది.

    Also Read: Celebrity Weddings 2021: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

    Tags