https://oktelugu.com/

Celebrities Died: 2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!

Celebrities Died 2021: పుట్టుక, చావు అనేది మనిషి చేతిలో ఉండదు. వీటి మధ్యలో ఉండేదే జీవితం. ఈ పరమార్థాన్ని తెలుసుకునేలోపే అంతా సమయం కాస్తా అయిపోతుంది. ఇక ఈ ఏడాదిలో కరోనా కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది మృత్యువాత పడ్డారు. ఓవైపు కరోనా రాక్షసి అందరినీ భయపడుతున్న సమయంలో పలువురు సెలబ్రెటీలు వివిధ కారణాలతో మృత్యువాతపడటం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరనిలోటును మిగిల్చింది. 2021లో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామందే మృత్యువాత […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2021 / 01:17 PM IST
    Follow us on

    Celebrities Died 2021: పుట్టుక, చావు అనేది మనిషి చేతిలో ఉండదు. వీటి మధ్యలో ఉండేదే జీవితం. ఈ పరమార్థాన్ని తెలుసుకునేలోపే అంతా సమయం కాస్తా అయిపోతుంది. ఇక ఈ ఏడాదిలో కరోనా కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది మృత్యువాత పడ్డారు. ఓవైపు కరోనా రాక్షసి అందరినీ భయపడుతున్న సమయంలో పలువురు సెలబ్రెటీలు వివిధ కారణాలతో మృత్యువాతపడటం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరనిలోటును మిగిల్చింది.

    Celebrities Died

    2021లో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామందే మృత్యువాత పడ్డారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఈ ఏడాది సినీ సెలబ్రెటీలు పెద్దసంఖ్యలో మృత్యువాత పడటం అభిమానులకు కలిచివేసింది. టాలీవుడ్ విషయానికొస్తే సీనియర్ నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్, కామెడియన్, డాన్స్ మాస్టర్, సాహితివేత్త అనే తేడా లేకుండా అన్ని రంగాలకు చెందిన వారు ఈ ఏడాది మృత్యుఒడిలోకి వెళ్లారు. అలాంటి వారిని ఓసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం..!

    ‘వేదం’ సినిమాతో 70ఏళ్ల వయస్సులో నాగయ్య అనే రైతు నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్పించిన నాగయ్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో నాగయ్య కన్పించాడు. 70ఏళ్ల వయస్సులోను నాగయ్య ఎంతో చలాకీగా కన్పించేవాడు. అయితే అనారోగ్య కారణాలతో 2021 మార్చి 27న నాగయ్య మృతిచెందాడు.

    ఎన్టీఆర్, ఎన్నాఆర్ లాంటి మహానుభావులతో నటించిన పొట్టి వీరయ్య సైతం 2021లోనే మృతిచెందాడు. మరుగుజ్జు పాత్రల్లో కన్పించే పొట్టి వీరయ్య కామెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. ఆయన దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 25న పొట్టి వీరయ్య కన్నుమూశాడు.

    Also Read: గ్లామర్​ హద్దులు చెరిపేసి హాట్ లుక్స్​తో సామ్​.. నెట్టింట పిక్స్ వైరల్​

    నటుడు, జర్నలిస్టు అయిన టీఎన్ఆర్ యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తుమ్మల నరసింహ రెడ్డి అలియాస్ టీఎన్ఆర్ సినిమా జర్నలిస్టుగా ఇండస్ట్రీలో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టీఎన్ఆర్ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ ఏడాది మే 10న కరోనా కారణంగా మృతిచెందాడు.

    నటుడిగా సినీ విమర్శకుడిగా కత్తి మహేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడియన్ గా పలు సినిమాల్లో కన్పించిన కత్తి మహేస్ జూన్ 26న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఉదయ్ కిరణ్ తో ‘శ్రీరామ్’ మూవీని తెరకెక్కిన డైరెక్టర్ సాయిబాలాజీ, ప్రముఖ పీఆర్వో బీఏ రాజు, సీనియర్ నటి జయంతి, డాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఇదే ఏడాది మృత్యువాత పడటం శోచనీయంగా మారింది.

    Also Read: మాస్ మహరాజ్ రవితేజ అభిమానులకు నిరాశ తప్పదా… ఆ మూవీ రిలీజ్ వాయిదా ?