Ram Charan childhood story: ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిరంజీవి కొడుకుగా వచ్చినప్పటికి ఆ తర్వాత రామ్ చరణ్ అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న పెద్ది సినిమా విషయంలోను ఆయన చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా భారీ విజయాన్ని సాధించే దిశగా ఉండాలని ఆయన పకడ్బందీ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.
అలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చాలామంది పేదవాళ్లకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. తను ఇప్పుడే కాదు స్కూల్ డేస్ లో కూడా తన చిన్ననాటి స్నేహితులకు హెల్ప్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయట. తను చాలా మందికి డబ్బుల సహాయాన్ని అందిస్తూనే ఎవరికి చెప్పకని చెప్పేవారట. అప్పట్లోనే ఆయన సేవా కార్యక్రమాలను చేపట్టేవాడు.
చిరంజీవి ఎప్పుడు ఇతరులకు మనం సహాయం చేయాలని చెబుతూ ఉండేవారట. అందుకే రామ్ చరణ్ సైతం సేవలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సేవలు ఒకెత్తయితే ఇప్పుడు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అపోలో ఆసుపత్రి ద్వారా చాలామందికి సహాయ సహకారలను కూడా అందిస్తున్నారు.
అయితే ఆయన నుంచి సహాయం తీసుకున్న వారు ఎవరిని బయట చెప్పకూడదనే ఒక కండిషన్ అయితే పెడతారట. మొత్తానికైతే రామ్ చరణ్ ఇటు హీరోగా రానిస్తూనే, అటు తండ్రి దగ్గర నుంచి పొందిన క్రమశిక్షణను పాటిస్తూ సహాయ సహకారాలను సైతం అందిస్తూ రియల్ హీరోగా ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి రామ్ చరణ్ పాన్ ఇండియా పరిధి ని దాటి పాన్ వరల్డ్ ఇండస్ట్రీ లో సైతం రాణిస్తాడా లేదా అనేది…
