Ram Charan And Chiranjeevi: ‘చిరుత’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నటుడు రామ్ చరణ్… తను చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే చిరుత సినిమాలో ఆయన ఇచ్చిన ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆ రేంజ్ ఇంట్రడక్షన్ ఇప్పటివరకు ఏ హీరోకి పడలేదని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అలాంటి రామ్ చరణ్ ఆ తర్వాత పూర్తి కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటూ వరుసగా సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో రామ్ చరణ్ రొటీన్ సినిమాలు చేస్తున్నాడనే విమర్శను కూడా మూట గట్టుకున్నాడు… అప్పట్లో రామ్ చరణ్ ఓకే చేసిన రెండు కథలను చిరంజీవి రిజెక్ట్ చేశారట… అందులో ఒకటి మెర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. కానీ చిరంజీవి మాత్రం ఆ స్టోరీ రామ్ చరణ్ కి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాని కాన్సల్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు…
Also Read: గవర్నర్ మార్పు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పెద్ద స్కెచ్
తమిళ్ డైరెక్టర్ భరణి దర్శకత్వంలో మెరుపు అనే ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఆ మూవీ స్టార్ట్ చేశాడు..అయితే ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికి దానికి పెట్టే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అప్పుడు రామ్ చరణ్ కి ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకొని చిరంజీవి ఆ సినిమాని క్యాన్సిల్ చేశారట.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ చిరంజీవి ఏది చెబితే అది తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. చిరంజీవి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు…ప్రతి విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఒక సినిమా చేస్తే ప్రొడ్యూసర్ కి లాభం రావాలి అంతే తప్ప నష్టాల రాకూడదనే ఉద్దేశ్యంతోనే సినిమాలను చాలా జాగ్రత్తగా చేస్తుంటాడు.
ఆ స్టోరీ కి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయాన్ని సైతం అంచనా వేసి అది వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తేల్చి చెప్పేస్తాడు.ఇక రామ్ చరణ్ ఒకే చేసిన ప్రాజెక్టులను చిరంజీవి రిజెక్ట్ చేయడంపై రామ్ చరణ్ కొంతవరకు నిరాశను వ్యక్తం చేశాడట. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అదంతా తన మంచి కోసమే చేశాడని రామ్ చరణ్ కూడా రియలైజ్ అయినట్టుగా తెలుస్తుంది…