
డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు. అసలు ఏవరేజ్ రేంజ్ సినిమాల డైరెక్టర్స్ కే అవకాశాలు వెల్లువులా వస్తుంటే.. పాపం వంశీకి మాత్రం మినిమమ్ ఛాన్స్ కూడా రాలేదు. హిట్ సినిమా తరువాత కూడా మళ్లీ సినిమా కోసం కష్టపడాల్సి వస్తోంది. ఇక ఇప్పట్లో సినిమా రాదు అని ఫిక్స్ అయిన వంశీ.. మొత్తానికి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. దీపావళి నాడు అధికారికంగా అల్లు అర్జునే స్వయంగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించాడు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కోసం వంశీ ఒక కథ రాశాడు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రారంభం
కథను రెడీ చేసి అల్లు అరవింద్ ను ఒప్పించడానికి గత రెండు నెలలు నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. పాపం ఈ రోజు అల్లు అరవింద్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి అరవింద్ కథ ఒప్పుకోవడం అంటే.. మాములు విషయం కాదు కదా. మొదట వంశీ ఫలానా లైన్ మీద సిరీస్ చేస్తున్నా అంటే.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయ్, అప్పుడు డిసైడ్ చేద్దాం అని అరవింద్ చాలా మర్యాదగా చెప్పి.. మొత్తానికి కథను ఫైనల్ చేయడానికి దాదాపు మూడు నెలలు తిప్పించుకున్నాడు. ఈ మధ్యలో నెలల తరబడి వంశీ టైం వేస్ట్ అయిందట.
Also Read: బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !
పోనిలే కనీసం ఇప్పటికైనా కథ ఓకే అయింది. ఇక వంశీ ఈ వెబ్ సిరీస్ తరువాత, తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కథతో ఒప్పించాడు. చరణ్ కూడా వంశీతో సినిమాకి ఇంట్రస్ట్ గా ఉన్నాడట. అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అన్నట్లు వంశీ త్వరలోనే మెగాస్టార్ ను కూడా కలిసి కథ చెప్పనున్నాడు. చిరుకి ఎలాగూ కథ నచ్చిందనే నమ్మకం ఉంది కాబట్టి.. వచ్చే దసరాకి రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ అవ్వడం ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్