https://oktelugu.com/

Talasani Srinivas: సినిమా టికెట్ ధరలపై నిర్మాతలకు షాకిచ్చిన మంత్రి తలసాని..!

Talasani Srinivas: కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడే చలన చిత్ర రంగం కోలుకుంటోంది. ఇన్ని రోజులు సినిమాలు లేక నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిత్ర పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందో అప్పటి నుంచి అన్ని రంగాలు నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాయి. ఇప్పటికీ కూడా ఇంకా అన్ని రంగాలు కోలుకోలేదు. తీరా దేశంలో, రాష్ట్రంలో ఆర్థికం గాఢీన పడుతుందనుకునేలోపు ‘ఒమిక్రాన్’ రూపంలో దేశంలో మరోసారి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2021 / 05:34 PM IST
    Follow us on

    Talasani Srinivas: కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడే చలన చిత్ర రంగం కోలుకుంటోంది. ఇన్ని రోజులు సినిమాలు లేక నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిత్ర పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందో అప్పటి నుంచి అన్ని రంగాలు నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాయి. ఇప్పటికీ కూడా ఇంకా అన్ని రంగాలు కోలుకోలేదు. తీరా దేశంలో, రాష్ట్రంలో ఆర్థికం గాఢీన పడుతుందనుకునేలోపు ‘ఒమిక్రాన్’ రూపంలో దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకివచ్చిన ఈ కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో ఎంటరైంది. ఇండియాలో మొదటి రెండు కేసులు బెంగళూరులో వెలుగుచూడగా, తెలంగాణలో మొత్తం 9 కేసులు వచ్చినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి.

    Minister Talasani

    చిత్ర పరిశమ్రకు గడ్డుకాలం..

    కరోనా కష్టకాలంలో చాల సినిమాలు ఆగిపోయాయి. కొవిడ్ రూల్స్ పాటిస్తూ కొన్ని చివరిదశలో ఉన్న సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా థియేటర్ల మూసివేసి నిర్మాతలు తాము నష్టపోవద్దని ఓటీటీ రంగాన్ని ఎంచుకున్నారు. మొన్నటివరకు ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. అమెజాన్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నేరుగా నిర్మాతల నుంచి సినిమాలు కొని మూవీకి వచ్చే రేటింగ్స్ ఆధారంగా విడతల వారీగా పేమెంట్స్ చేశాయి. దీంతో థియేటర్స్ యాజమాన్యాలు కూడా లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా నష్టపోవాల్సి వచ్చింది. థియేటర్లు మూసివేసి ఉండటంతో వారికి రెవెన్యూ లేక ప్రభుత్వానికి కూడా టాక్స్ చెల్లించలేని దీన స్థితిలో మినహాయింపు ఇవ్వాలని కోరుకున్నారు.

    టికెట్ ధరల పెరుగుదలతో నిర్మాతలపై భారం..

    ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయినా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఆశించినంతగా ఆక్యూపెన్సీ ఉండటం లేదు. చాలా మంది కరోనా పీరియడ్‌లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు థియేటర్ల ముందుకు వస్తున్నాయి. ఈ టైంలో సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని థియేటర్స్ అసోసియేషన్ హైకోర్టు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాయి. దీని ప్రకారం సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఏషియన్ వంటి పెద్ద థియేటర్లలో పెద్దసినిమాలు విడుదల టైంలో రూ.50 మేర పెంచుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, టికెట్ రేట్లు పెంచుతూ పోతే జనాలు థియేటర్లకు రావడానికి ఇష్టం చూపించరు. పైరసీకి లేదా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గితే ఫలితంగా నిర్మాతలకే నష్టం..

    Also Read: Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

    ఏపీ సంచలనం.. ఆన్లైన్ టికెటింగ్..

    ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ ఉండవని ప్రకటించింది. రోజుకు నాలుగు ఆటలు మాత్రమే. ఇన్నిరోజులు విచ్చలవిడిగా పెంచిన టికెట్ ధరలను తమ ఆధీనంలోకి తీసుకుంది. రూ.5 నుంచి టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేటర్ల వారీగా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ విధానం తీసుకురావడం ద్వారా పారదర్శకత ఉంటుందని భావించింది జగన్ సర్కార్. ఈ నిర్ణయాన్ని కొందరు సినీ పెద్దలు ఆహ్వానించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో దర్శకనిర్మాతలు భేటీ అయ్యారు. జనవరిలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న టైంలో టికెట్ ధరలు పెంచితే ఈ భారం ప్రేక్షలకుపై పడుతుందని, ఏపీ ప్రభుత్వం మాదిరిగా ఇక్కడ కూడా ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరినట్టు తెలిసింది. అందుకు ఆయన నిర్మోహమాటంగా ధరల పెరుగుదల మా చేతిలో లేదని.. ఎవరో తగ్గించారని మేము తగ్గించలేమని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో థియేటర్లు మళ్లీ మూతబడతాయని వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ చాలా దెబ్బతిన్నదని కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, వచ్చే నెలలో పుష్ప, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మంత్రిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, చినబాబు, డీవీవీ దానయ్య, ప్రమోద్‌, యేర్నేని నవీన్‌, అభిషేక్‌ నామా డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్‌ ఉన్నారు.

    Also Read: Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా.. చివరికి బతుకు దగా

    Tags