https://oktelugu.com/

Ram Charan: ఎన్టీఆరే కాదు, చిరంజీవి అయినా తగ్గేదెలే అంటున్న చరణ్ !

Ram Charan: ‘ఆచార్య’ నుంచి ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఈ ప్రోమోలో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు స్టెప్స్, ముఖ్యంగా చరణ్ – చిరుకు మధ్య ఉన్న స్టెప్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ఇక మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి. అదే విధంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 18, 2022 / 06:45 PM IST
    Follow us on

    Ram Charan: ‘ఆచార్య’ నుంచి ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఈ ప్రోమోలో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు స్టెప్స్, ముఖ్యంగా చరణ్ – చిరుకు మధ్య ఉన్న స్టెప్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ఇక మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి.

    Ram Charan, Chiranjeevi

    అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. తండ్రీకొడుకులిద్దరూ మంచి డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ పోటీ పడీ డాన్సు చేయడం విశేషం. ఐతే, చరణ్‌ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా చిరు ఈ వయసులో అద్భుతంగా స్టెప్స్ వేయడం విశేషం.

    Also Read: Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు భారీ స్కెచ్.. ఏకతాటిపైకి పాత‘కాపు’లు

    ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. ఈ పాటకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రాశారు. ఈ పాటకి శేఖర్‌ మాస్టర్‌ స్టెప్స్ కంపోజ్‌ చేశారు. మొత్తానికి మెగా అభిమానులను హ్యాపీ చేయడానికి కొరటాల బాగానే ప్లాన్ చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

    ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఆచార్యలో చ‌ర‌ణ్ పాత్ర‌ ఎంతసేపు ఉంటుంది ? ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండ‌బోతుంది.

    Also Read: RRR OTT Release Date: RRR మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

    Tags