https://oktelugu.com/

KCR Federal Front: ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ క‌థ ముగిసిన‌ట్టేనా..? గులాబీ బాస్ కు ఇలా షాక్ తగిలిందేంటి..?

KCR Federal Front: సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఫ్రంట్ డ్రామా ఆడిన‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే అర్థం అవుతోంది. తాజాగా ప్ర‌తిప‌క్షాల సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో కేసీఆర్ పేరు లేక‌పోవ‌డంతో కేసీఆర్ అంటే ఎందో తేలిపోయింది. అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ కాంగ్రెస్ తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప బీజేపీ తో పొత్తు ఉన్న పార్టీల నేత‌ల‌ను క‌ల‌వ‌క‌పోవ‌డంలో కేసీఆర్ బీజేపీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 18, 2022 / 06:27 PM IST
    Follow us on

    KCR Federal Front: సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఫ్రంట్ డ్రామా ఆడిన‌ట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే అర్థం అవుతోంది. తాజాగా ప్ర‌తిప‌క్షాల సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో కేసీఆర్ పేరు లేక‌పోవ‌డంతో కేసీఆర్ అంటే ఎందో తేలిపోయింది. అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్‌ కాంగ్రెస్ తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప బీజేపీ తో పొత్తు ఉన్న పార్టీల నేత‌ల‌ను క‌ల‌వ‌క‌పోవ‌డంలో కేసీఆర్ బీజేపీ అనుకూల‌మ‌నే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపాదిస్తోన్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

    Mamatha, KCR

    కాంగ్రెసేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్న కేసీఆర్ ను దేశంలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాద‌ని తెలిసి కేసీఆర్ నే ప‌క్క‌కు పెడుతున్నాయా అంటే .. అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అస‌లు కేసీఆర్ బిజేపీ వ్య‌తిరేకం కాద‌నే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల‌ బీజేపీ విధానాలను, ప్రధాని మోదీ తీరును తీవ్రంగా ఖండిస్తూ 13 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనలో కేసీఆర్‌ పేరు లేకపోవడంతో కేసీర్ ఫ్రంట్ ముచ్చ‌ట ఇక క‌నుమ‌రుగేన‌ని టాక్. పైగా కేసీఆర్ ను బీజేపీ వ్య‌తిరేకి అని కూడా న‌మ్మ‌టం లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు మ‌న కేసీఆర్ ఫ్రంట్ ప‌రిస్థితి.

    గ‌తంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్య‌తిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని సీఏం కేసీఆర్ ఎప్ప‌టి నుంచో చెప్తున్న మాట‌. ఈ కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఆయన అప్ప‌ట్లో దేశవ్యాప్తంగా పర్యటించారు. 2018లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతిలతోనూ భేటీ అయ్యారు. వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వ‌హించారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చించారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్య పడలేదు.

    Also Read: Jabardasth: జబర్దస్త్ షోలో రెమ్యునరేషన్లు అంత తక్కువా.. స్కిట్ కు రూ.20,000 ఇస్తారంటూ?

    రీసెంట్ గా కూడా..

    కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం మెడ‌లు వంచుతం అని చెప్పి ఢీల్లి పోయి వంగి వంగి దండాలు పెట్టే కేసీఆర్ రీసెంట్ గా జ‌న‌వ‌రిలో కూడా పెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మరోసారి ప్రయత్నాలు చేశారు. లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సీపీఎం అగ్రనేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన నాలుగైదు రోజుల తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా కేసీఆర్ ఫోన్ లో మాట్లాడిన విష‌యం తెలిసిందే.

    రాష్ట్రంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల‌ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కాగా వరి ధాన్యం అంశాన్ని టీఆర్ఎస్ తెరమీదికి తీసుకొచ్చింది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపించింది. ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను మంత్రుల బృందం ఢిల్లీలో వారం రోజులు మకాం కూడా వేసింది. స్వ‌యంగా కేసీఆర్ దీక్ష‌లో పాల్గొన్న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మేమే వ‌డ్లు కొంటం అని ప్ర‌క‌టించారు కేసీఆర్.

    అయితే కాంగ్రెస్ లేని ఫెడ‌ర‌ల్ ప్రంట్ సాధ్యం కాద‌ని తెలిసి ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ తో న‌డిచేందుకు సుముఖ‌త చూప‌డంలేదు. అందుకే ప్రాతీయ పార్టీల ప్ర‌క‌ట‌న‌లో కేసీర్ పేరు చేర్చ‌క‌పోవ‌డం అనేది వాస్త‌వం. బీజేపీ వ్యతిరేక కూటమిగా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన చేస్తున్న కేసీఆర్‌ ను పూర్తిగా పక్కన పెట్టేయడంపై జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

    మ‌మ‌తా జీ కూడా నో..

    అయితే చాలా కాలం పాటు కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూ వచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్ ప్రాముఖ్యతను అనివార్యంగా అంగీకరిస్తున్న వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ఇదివరకు సమావేశమైన శరద్ పవార్(ఎన్సీపీ), ఎంకే స్టాలిన్(డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం) ఇప్పటికే కాంగ్రెస్ లేని బీజేపీయేతర కూటమికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వ సారధి ఉద్దవ్ ఠాక్రే(శివసేన)సైతం కేసీఆర్ ప్రతిపాదనల్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు చర్యలతో వెల్లడైంది. ఇప్పుడు..

    ఢిల్లీలో కనీసం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ అవసరమైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ప్ర‌క‌ట‌న‌తో తేలిపోయింది.

    KCR, Kejriwal

    అయితే కేసీఆర్ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషణలు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్ చేసిన అన్నిచట్టాలనూ సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

    Also Read: Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు భారీ స్కెచ్.. ఏకతాటిపైకి పాత‘కాపు’లు

    Tags