Ram- Boyapati Movie: అనుకున్న తేదీ కంటే ముందు విడుదల అవుతున్న రామ్ – బోయపాటి సినిమా

మాస్ మరియు యూత్ లో మంచి ఇమేజి ఉన్న రామ్ కి బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ తగిలితే ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు. అందులోనూ బోయపాటి శ్రీను అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. అందుకే ట్రేడ్ లో ఈ చిత్రానికి స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని డిమాండ్ ఉంది.

Written By: Vicky, Updated On : June 23, 2023 1:17 pm

Ram- Boyapati Movie

Follow us on

Ram- Boyapati Movie: యంగ్ హీరో రామ్ లేటెస్ట్ గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కి కూడా రామ్ పుట్టిన రోజు నాడు వచ్చేసింది. ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

మాస్ మరియు యూత్ లో మంచి ఇమేజి ఉన్న రామ్ కి బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ తగిలితే ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు. అందులోనూ బోయపాటి శ్రీను అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. అందుకే ట్రేడ్ లో ఈ చిత్రానికి స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని డిమాండ్ ఉంది.

తొలుత ఈ చిత్రాన్ని అక్టోబర్ 20 వ తారీఖున విడుదల చేద్దాం అనుకున్నారు, కానీ షూటింగ్ శరవేగంగా సాగిపోతూ ఉండడం తో సెప్టెంబర్ 15 వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. హీరో రామ్ కి ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. రీసెంట్ గా ఆయన తమిళ డైరెక్టర్ లింగు స్వామి తో కలిసి చేసిన ‘ది వారియర్’ అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ గా నిల్చింది.

ఇప్పుడు బోయపాటి శ్రీను తో తియ్యబోతున్న మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ బోయపాటి శ్రీను ఒక్క బాలయ్య బాబు కి తప్ప యంగ్ హీరోలతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఒక్క అల్లు అర్జున్ తో చేసిన ‘సరైనోడు’ చిత్రం తప్ప మిగిలినవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి, మరి రామ్ కి అయినా హిట్ ఇస్తాడో లేదో చూడాలి.