Rakul Preet Singh
Rakul Preet Singh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినప్పటికీ, అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. అలా సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో ఈమెకు హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో ఇక ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టి చూస్తుండగానే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంత వేగంగా అయితే ఈమె స్టార్ హీరోయిన్ అయ్యిందో, అంతే వేగంగా డౌన్ ఫాల్ ని కూడా చూసింది.
ఈమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. హిందీ లో అడపాదడపా రెండు మూడు హిట్ సినిమాలు దక్కినప్పటికీ అవి ఈమె కెరీర్ ని బూస్ట్ చేసేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో ప్రస్తుతం సౌత్ లో రకుల్ కి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కరువు అయ్యారు. కానీ రకుల్ సేఫ్ సైడ్ గా పలు వ్యాపారాలను కూడా స్థాపించి ఆర్థికంగా స్థిరంగా నిలబడింది. చాలా రోజుల నుండి ఆమె ఒక జిమ్ ని నడుపుతుంది. హైదరాబాద్ లో పలు బ్రాంచీలను ప్రారంభించింది. అదే విధంగా ఈమెకు ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రాంతాల్లో కూడా జిమ్ లు ఉన్నాయి. ఇవి ఇప్పుడు భారీ లాభాల్లోనే నడుస్తున్నాయి. అదే విధంగా గత ఏడాది ఈమె ఆరంభం అనే రెస్టారంట్ ని ప్రారంభించింది. స్వచ్ఛమైన హిందూ సంప్రదాయాలతో చేసే వంటకాలతో ఈ రెస్టారంట్ మొదలైంది.
రెస్పాన్స్ అదిరిపోయింది. హైదరాబాద్ లోని మారుమూల ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఈ రెస్టారంట్ లోకి వచ్చి ఈ ఫుడ్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇక్కడ రేట్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. కేవలం ఒక్క దోశ విలువ 100 రూపాయలకు పైనే ఉంది. కానీ రేట్ కి తగ్గ క్వాలిటీ ని మైంటైన్ చేస్తున్నారు రెస్టారంట్ యాజమాన్యం. రెండు ఇడ్లీ ఇక్కడ తినాలంటే 80 రూపాయిలు ఖర్చు చేయాలి. హైదరాబాద్ లో మహేష్ బాబు, విరాట్ కోహ్లీ వంటి సెలెబ్రెటీలకు కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. వాళ్ళ రెస్టారెంట్స్ లో ఉన్న రేట్లతో పోలిస్తే రకుల్ రెస్టారంట్ లో ఉండే రేట్స్ చాలా తక్కువ అనే చెప్పొచ్చు. కాబట్టి ఒకసారి వెళ్లి ఇక్కడ ఫుడ్ ని ట్రై చేయండి. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే హిందీ లో తెరకెక్కిస్తున్న రామాయణం లో ఈమె సూర్పనక్క గా నటిస్తుంది. ఈ చిత్రం తో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఈమె ఒప్పందం చేసుకుంది.