Chandra Bose and Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన పరంగా ఎంత దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ చూడనంత మార్పులను మనం చూస్తున్నాం. ఒకప్పుడు గ్రామాల్లో రోడ్డులు, మంచి నీరు, విద్యుత్ దీపాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడేవారు జనాలు. హాస్పిటల్ కి వెళ్లాలన్నా కూడా ఎన్నో కష్టాలు పడి వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి పరిస్థితుల నుండి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 11 వేల రోడ్ల నిర్మాణం చేపట్టి సంచలనం సృష్టించాడు. ‘గ్రామసభలు’ ద్వారా ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా అన్ని సమస్యలు తీరిపోయాయి. కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, వాటిని సమర్థవతంగా పరిశీలిస్తూ తప్పు జరగకుండా చూసుకుంటున్నాడు. ఆయన పని తీరుని చూస్తుంటే ఎంతో బాధ్యతతో, ప్రజలకు నిండు మనసుతో సహాయం చేయాలనే తత్త్వం జనాలకు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే, ఇక ముఖ్యమంత్రి అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అని అనుకుంటున్నారు జనాలు.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయితా చంద్రబోస్ లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ పవన్ కళ్యాణ్..ఆ పేరు వింటేనే నాకు ఒక కొత్త ఆక్సిజన్ లాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా నా మీద నాకు ఇది చేయగలనా అని సందేహం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తల్చుకుంటాను. ఆయన రాజకీయ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బలమైన సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అనడానికి నిదర్శనం ఆయన. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా, రాజకీయాల నుండి వెళ్లిపోకుండా, బలంగా నిలబడి, తాను నిలబడడమే కాకుండా, రాష్ట్రం నుండి సెంట్రల్ వరకు అందరినీ నిలబెట్టే స్థాయికి ఎదిగి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం చిన్న విషయం కాదు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక పక్క పాలనలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, మరో పక్క సినిమాలు కూడా చేస్తూ రెండిటిని బ్యాలన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న సినిమాలలో ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను అతి త్వరలోనే పూర్తి చేసుకొని మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో మరియు టీజర్ ని ఇది వరకే అభిమానులు చూసారు. రేపు ఆయన స్వయంగా పాడిన ‘మాట వినాలి’ పాటను విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన చిన్న ప్రోమో ని మొన్న విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేపు విడుదల కాబోయే పాట ఏమేరకు అభిమానులను అలరిస్తుందో చూడాలి.
Pawan Kalyan Garu is like my ‘Oxygen’ , his journey is truly inspiring : #ChandraBose pic.twitter.com/pp58zFzloJ
— ArunKumar (@arunganta) January 16, 2025