https://oktelugu.com/

సాయిపల్లవికి మరో సర్ ప్రైజ్..

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయిపల్లవికి సెలబ్రెటీలు, అభిమానులు పెద్దఎత్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శనివారం ఉదయమే ‘విరాటపర్వం’ చిత్రబృందం సాయిపల్లవికి సంబంధించిన ఫస్టు లుక్ విడుదల చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ‘లవ్ స్టోరీ’ చిత్రబృందం సాయిపల్లవికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. సాయిపల్లవి వర్షంతో తడుస్తూ డాన్స్ చేస్తున్న లుక్ ను చిత్రబృందం విడుదల చేసి ఆమెకు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు. లాక్ డౌన్ తర్వాత మరింత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 / 03:27 PM IST
    Follow us on


    నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయిపల్లవికి సెలబ్రెటీలు, అభిమానులు పెద్దఎత్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శనివారం ఉదయమే ‘విరాటపర్వం’ చిత్రబృందం సాయిపల్లవికి సంబంధించిన ఫస్టు లుక్ విడుదల చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ‘లవ్ స్టోరీ’ చిత్రబృందం సాయిపల్లవికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. సాయిపల్లవి వర్షంతో తడుస్తూ డాన్స్ చేస్తున్న లుక్ ను చిత్రబృందం విడుదల చేసి ఆమెకు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేశారు.

    లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

    ప్రేమకథలను అద్భుతంగా చిత్రీకరించడంలో శేఖర్ కమ్ములది అందేవేసిన చేయి. ‘హ్యాపీడేస్’, ‘ఆనంద్’, ‘గోదావరి’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను శేఖర్ కమ్ముల మెస్మరైజ్ చేశాడు. తాజాగా నాగచైతన్య-సాయిపల్లవి జోడీగా ‘లవ్ స్టోరీ’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించి టీజ‌ర్, సాంగ్స్ అభిమానులను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. నేడు సాయిపల్లవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న పోస్టర్ ను నాగచైతన్య తన ట్వీటర్లో పోస్టు చేసి బర్త్ డే విషెస్ తెలిపాడు.

    ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!

    కాగా ఈ మూవీని తొలుత లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలన్నారు. కొన్ని కారణాలతో ఈ మూవీ వాయిదా పడింది. సమ్మర్లో విడుదల చేయాలనుకున్న సమయంలో లాక్డౌన్ కారణంగా మరోసారి వాయిదా పడింది. త్వరలో ఈమూవీ రిలీజ్ తేదిన ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.