Rakul Preet Singh : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మన సౌత్ లో ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. చూపులు తిప్పుకోలేని అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ, 24 గంటలు జిమ్ లో వర్కౌట్స్ చేసి, శరీరాన్ని కరగదీసుకొని అందాన్ని మొత్తం కోల్పోయింది. అసలే సన్నగా ఉండే రకుల్, వర్కౌట్స్ చేసి ఇంకా సన్నగా తయారు అవ్వడంతో ఆమె అభిమానులు ఆ లుక్ ని చూసి షాక్ తిన్నారు. అందుకే ఆమెతో ఇప్పుడు సౌత్ లో సినిమాలు తీసే డైరెక్టర్స్ కరువయ్యారు. ఒకప్పుడు డేట్స్ ని సర్దుబాటు చేయలేక తికమక పడేంత బిజీ గా ఉండేది రకుల్. ఒక్కసారిగా జీవితం తలక్రిందులైంది. అంతే కాకుండా రీసెంట్ గా ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మన దరర్శకులు.
అలా ఎంత తొందరగా అయితే ఈమె స్టార్ హీరోయిన్ అయ్యిందో, అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే గత ఏడాది ఈమె ఫిబ్రవరి నెలలో జాకీ భగ్నానీ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లి జరిగి ఏడాది అయ్యింది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో, ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత నేను నా భర్త జాకీ ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. షూటింగ్ సమయంలో జాకీ ని బాగా మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే షూటింగ్ కి వెళ్ళేటప్పుడు జాకీ జాకెట్ ని నాతో పాటు తీసుకెళ్తాను. మా ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ.’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
ఆమె మాట్లాడిన ఈ మాటలను చూసి అభిమానులు జలసీ ఫీల్ అవుతున్నారు. ఇంత ప్రేమించే అమ్మాయి దొరకడం చాలా అరుదు, జాకీ అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా బాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో కలిసి ‘మేరె హస్బెండ్ కి బివి’ అనే సినిమా చేసింది. ఈ ఛితంలో ఆమెతో పాటు భూమిక పెడ్నేకర్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టినా కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు. ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ రామాయణం లో నటిస్తుంది. ఇందులో ఆమె సూర్పనక్క పాత్రలో కనిపించనుంది. రామాయణం లో ఇది విలన్ పాత్ర అనే సంగతి అందరికీ తెలిసిందే. రకుల్ చివరికి ఇలాంటి క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయిపోతుండడం ఆమె అభిమానులకు అసలు నచ్చడం లేదు.