Mazaka: సందీప్ కిషన్(Sandeep Kishan), రావు రమేష్(Rao Ramesh) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా రీతూ వర్మ, అన్షు నటించగా, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మఞ్ఞచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు బాగా అగ్గిపోయాయి. ట్రైలర్ ని చూసిన తర్వాత చాలా రొటీన్ స్టోరీ, కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. ఈ సినిమాకి ప్రసన్న కుమార్ (బెజవాడ) కథ, మాటలు అందించాడు. ‘ధమాకా’ చిత్రానికి కూడా ఆయనే రచయితగా పని చేసాడు.
అయితే ఈ సినిమాని ముందుగా సందీప్ కిషన్, రావు రమేష్ లతో చేయాలనీ అనుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కలిసి ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నారట. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’,’బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ చివరి నిమిషం లో క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్నీ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన స్వయంగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ కథ ముందుగా చిరంజీవి గారి వద్దకు వెళ్లిన విషయం వాస్తవమే. కానీ ఏ వెర్షన్ కథ ఆయన వద్దకు వెళ్లిందో నాకు తెలియదు. ఆయన ఒక మెగాస్టార్, ఆయన స్థాయికి తగ్గట్టుగానే పాత్రని మలిచి ఉంటారు. మేము డిజైన్ చేసిన రావు రమేష్ పాత్ర లాగా ఉండదు’ అని చెప్పుకొచ్చాడు.
హీరో సందీప్ కిషన్ కూడా ఇదే మాట అన్నాడు. ఆయన మాట్లాడుతూ ‘కొన్ని కథలు అద్భుతంగా ఉన్నప్పటికీ, హీరో ఇమేజీకి సరిపోయేట్టు ఉండకపోవడం వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ కథ కూడా అలాగే రిజెక్ట్ అయ్యుండొచ్చు. రావు రమేష్ పాత్రలో మనం మెగాస్టార్ చిరంజీవి ని ఊహించుకోగలమా?..తన ఇమేజ్ కి సూట్ కాదని ఆయన అలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’ అంటూ చెప్పకొచ్చాడు. కానీ చిరంజీవి , సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ క్రేజీ గా ఉంటుంది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ లో కింగ్. ఇక సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన రైటర్ కూడా. వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చి ఉండుంటే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు మిస్ అయినా భవిష్యత్తులో అయినా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాలి.