Rakul Preet Singh: టాలీవుడ్ యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలియని వారుండరు. ఆమె నటించిన సినిమాలు యావరేజ్ గా హిట్టు కొట్టినా అవకాశాలు మాత్రం అమ్మడు ఇంటిదారిపడుతున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ కు లేని సినిమాలు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ ఫుల్ బిజీ అయిందీ భామ. సినిమాల్లో ఓ వైపు బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం అలరిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎక్సర్ సైజ్ చేసిన కొన్ని ఫొటోలను అభిమానులకు షేర్ చేసి తాను ఫిట్ నెస్ భామ అని అనిపించుకుంది. లెటేస్టుగా ఈ సుందరి కొన్ని హాట్ ఫొటోస్ ను నెట్టింట్లో పెట్టింది. దీంతో యూత్ ఆ పిక్స్ ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

తెలుగులో ‘కెరటం’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ సందీప్ కిషన్ కు జతగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో అమ్మడుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది. ‘రఫ్’, ‘లౌక్యం’ సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడితో ఆగకుండా స్టార్ హీరోలు ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో..’, నాగార్జున పక్కన ‘మన్మథుడు’ సినిమాల్లో నటించింది. ఇలా వరుసగా సినిమాల్లో నటించిన భామ చివరిగా తెలుగులో ‘కొండపొలం’తో అలరించింది.
ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ బాలీవుడ్లో దూసుకుపోతుంది రకుల్. చేతినిండా హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రన్ వే 34 , అటాక్ అనుకున్న స్థాయిలో రాణించకపోయినా రకుల్ ను ప్రేక్షకులు ఆదరించారు. దీంతో భామకు బాలీవుడ్లోనూ మంచి నటిగా గుర్తింపు పొందింది. అటు డిజిటల్ ప్లాట్ ఫాం పై కూడా సుందరి దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో ‘కట్ పుట్లి’ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది.

ఇలా సినిమాల్లో బిజీగా ఉన్నా రకుల్ సోషల్ మీడియాను అంటిపెట్టుకొని ఉంటోంది. నిత్యం తన లెటేస్ట్ ఫొటోస్ తో యూత్ కు మతి లేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ మాల్దీవుల్లో తన డ్రెస్సింగ్ తో రచ్చ చేసింది. వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చిన రకుల్ బికినీలో దర్శనమిచ్చింది. మెరున్ కలర్ బికినీ ధరించి ఎద అందాలను షో చేసింది. అటు థైస్ కనిపించేలా ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు ‘నీ మైండ్ సెట్ బాగున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది’ అనే క్యాప్షన్ పెట్టడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.