Rakul Preet: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత అగ్ర హీరోలతో వరుసగా అవకాశాలు దక్కించుకుని.. హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతంం రకుల్ థాంక్స్ గాడ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో విడుదలకు సిద్ధమైంది. కాగా, ఈ సినిమాలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కాగా, గతంలో నిర్మాత, నటుడు జాకీ భగ్నానితో రకుల్ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా, తన లవ్ మేటర్‌ను ఎందుకు బహిరంగంగా చెప్పాల్సి వచ్చిందో వివరించింది రకుల్.. ఈ క్రమంలోనే రకుల్ మాట్లాడుతూ.. “నాకు నచ్చిన విషయాలను మాట్లాడటానికే ఇష్టపడతా.. నా వ్యక్తిగత జీవితం గురించి నేను బహిరంగంగా చెప్పగలుగుతున్నానంటే.. అది చాలా గొప్పదని నా అభిప్రాయం. కాబట్టి నేను అలాంటి విషయాలను అందరితో పంచుకోవాలనుకుంటా”. అని చెప్పుకొచ్చింది.
ఈ క్రమలోనే వివాహం గురించి మాట్లాడుతూ.. “ఓ సెలెబ్రిటీ అన్నాక.. అందరీ కళ్లు వారిపైనే ఉంటాయని నాకు తెలుసు.. అదే మాకు నెగెటివ్. అయితే, నా చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం నాపై పడకుండా కెమెరా ముందు నేను నా పని చేసుకుంటూ పోతాను. ఇక కెమెరా వెనక నా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది నా పర్సనల్.. నేను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎలాగో మీతోనే పంచుకుంటాను. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా..” అని చెప్పింది.