https://oktelugu.com/

‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి  !     

ర‌కుల్ ప్రీత్ సింగ్ ..  గత కొన్ని రోజులుగా నేషనల్ వైడ్‌ గా హాట్ టాపిక్ అయిన సెలెబ్రిటీ లిస్ట్‌లో ఉందనే సంగతి తెలిసిందే. ఓ దశలో రకుల్ కూడా డ్రగ్ కేసులో చిక్కుకుందనే ఆరోపణలు చాల బలంగా వినిపించాయి.  దానికితోడు  బాలీవుడ్‌ హీరోయిన్ రియా చక్రబోర్తి అరెస్ట్ అవ్వడం.. ఆ తరువాత శాండిల్‌వుడ్‌ లో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలు కూడా అరెస్ట్‌ అవ్వడం  ఇలా  హీరోయిన్స్  మొత్తానికి  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2020 / 07:15 PM IST
    Follow us on

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ..  గత కొన్ని రోజులుగా నేషనల్ వైడ్‌ గా హాట్ టాపిక్ అయిన సెలెబ్రిటీ లిస్ట్‌లో ఉందనే సంగతి తెలిసిందే. ఓ దశలో రకుల్ కూడా డ్రగ్ కేసులో చిక్కుకుందనే ఆరోపణలు చాల బలంగా వినిపించాయి.  దానికితోడు  బాలీవుడ్‌ హీరోయిన్ రియా చక్రబోర్తి అరెస్ట్ అవ్వడం.. ఆ తరువాత శాండిల్‌వుడ్‌ లో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలు కూడా అరెస్ట్‌ అవ్వడం  ఇలా  హీరోయిన్స్  మొత్తానికి  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే రియా చక్రబోర్తి విచారణలో భాగంగా రకుల్ పేరు చెప్పిందనేది బాలీవుడ్ మీడియా బాగా రాసుకొచ్చింది. ఆ రకంగా దేశ వ్యాప్తంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా మార్మోగిపోయింది. ఆమె కూడా అరెస్ట్ అవుతుందనే హడావుడి కూడా చేసింది బాలీవుడ్ మీడియా.
    Also Read : కీరవాణి నుండి ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !
     
    నెటిజన్లు కూడా రకుల్ పై విరుచుకుపడ్డారు. నిత్యం వ్యాయమాం, ఫిట్నెస్, వెజిటేరియన్ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతావుగా రకుల్. మరి డ్రగ్స్ గురించి ఎందుకు చెప్పలేదు, అన్నట్టు ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటున్నావ్ అంటూ నానా రకాలుగా  రకుల్‌ ని ట్రోల్స్ చేసి పారేశారు నెటిజన్లు. అయితే ఇలా  డ్రగ్స్ కేసులో తన పేరు మార్మోగుతున్న సమయంలోనే వికారాబాద్‌లో జరుగుతున్న క్రిష్ సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ రకుల్ ముంబాయి వెళ్లిపోయింది.  మొత్తానికి ముంబై వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దుకుని.. పనిలో పనిగా ఢిల్లీ హైకోర్టులో తన గోడును విన్నవించుకుని..  తన పై తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియా సంస్థల పై చర్యలు తీసుకోవాలని కూడా రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్ చేసింది.
     
    ఆ తరువాత తీరిగ్గా ఎన్‌సీబీ అధికారులు రియా డ్రగ్ కేసుకు సంబదించి ఎవరి పేర్లు చెప్పలేదని స్పష్టం చేశారు. ఆ రకంగా  డ్రగ్స్ కేసుకు రకుల్‌ ప్రీత్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదనేది స్పష్టం అయింది. ఇలా తన పై వచ్చిన డ్రగ్ వ్యవహారం అంతా ధైర్యంగా  చక్కపెట్టుకుని మళ్లీ క్రిష్ సినిమా షూటింగ్‌ స్పాట్ లోకి అడుగు పెట్టింది రకుల్.  వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతుండే సరికి  మళ్లీ ఈ రోజు అడవుల్లో రకుల్ ప్రత్యక్షమైంది.  దాదాపు పదిరోజులు పాటు అక్కడే షూట్ చేయనున్నారు.
    Also Read : ప్రభాస్ మూవీపై నాగ్ అశ్విన్ మరో అప్డేట్