ఏపీ ప్రభుత్వం సంచలనం.. దమ్మాలపాటిపై సుప్రీంకు..

ఏపీలో కలకలం సృష్టించిన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దమ్మాలపాటి కేసుపై మీడియాకు వెల్లడించవద్దని.. విచారణ జరుపరాదని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. Also Read : రైతుల  శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఇది విచారణకు వచ్చే అవకాశం […]

Written By: NARESH, Updated On : September 21, 2020 7:28 pm
Follow us on

ఏపీలో కలకలం సృష్టించిన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దమ్మాలపాటి కేసుపై మీడియాకు వెల్లడించవద్దని.. విచారణ జరుపరాదని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : రైతుల  శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ

దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో దమ్మాలపాటి సహా దీనివెనుకున్న వారికి ఈ పరిణామం షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలపెట్టకూడాదని జగన్ సర్కార్ కాచుకు కూర్చున్నట్టు తెలుస్తోంది.

దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఇటీవల అమరావతి భూకుంభకోణంలో కేసులు నమోదు చేసింది.దీంతో సీనియర్ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా స్టే లభించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాదు.. ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

దీంతో దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, జర్నలిస్టులు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  క్రమంలోనే ఈ కేసుపై ఏకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

Also Read : ఐడియా చెప్పండి… రూ.50 లక్షలు గెలవండి